Ashok Gehlot: విద్యుత్‌ వినియోగంపై ఇంధన సర్‌ఛార్జీలు రద్దు.. సీఎం గహ్లోత్‌ ప్రకటన

రాజస్థాన్‌ సీఎం కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో విద్యుత్‌వినియోగదారుల ఇంధన సర్‌ఛార్జీలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.

Published : 10 Aug 2023 16:59 IST

జైపూర్‌: రాజస్థాన్‌ ప్రజలకు ఆ రాష్ట్ర సీఎం అశోక్‌ గహ్లోత్‌(Ashok Gehlot) గుడ్‌న్యూస్‌ చెప్పారు. విద్యుత్‌ వినియోగదారుల ఇంధన సర్‌ఛార్జీలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ‘‘రాష్ట్రంలోని వినియోగదారులందరికీ ఇంధన సర్‌ ఛార్జీలను రద్దు చేస్తున్నాం. ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.2500 కోట్ల అదనపు భారం పడుతుంది’’ అని తెలిపారు.  ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే విద్యుత్‌ పంపిణీ సంస్థలకు చెల్లిస్తుందన్నారు. ఈ నిర్ణయంతో వ్యవసాయ, గృహ వినియోగదారులకు ఇంధన సర్‌ఛార్జీల భారం ఉండదన్నారు. 

ప్రాధేయపడినా వదల్లేదు.. మణిపుర్‌లో మరో ఆటవిక చర్య!

జైపూర్‌లోని బిర్లా ఆడిటోరియంలో నిర్వహించిన ఇందిరా గాంధీ స్మార్ట్‌ఫోన్‌ పథకం ప్రారంభోత్సవంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్హులైన మహిళలకు స్మార్ట్‌ఫోన్లను అందజేశారు. జ్ఞానమే శక్తి అనే థీమ్‌తో మహిళలకు స్మార్ట్‌ఫోన్లు ఇస్తున్నామని..  ఈ పథకం మహిళలకు సాధికారత కల్పిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. తొలి దశలో ఈ పథకం కింద వితంతువులు, ఒంటరి మహిళలతో పాటు  బాలికలు ఉన్న కుటుంబాలను ఎంపిక చేసినట్టు తెలిపారు. ఈ పథకం ప్రారంభ దశలో 40లక్షల మంది లబ్ధిదారులు ట్రాయ్‌ ధ్రువీకరించిన  టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల నుంచి డేటా కనెక్టివిటితో ఉన్న స్మార్ట్‌ఫోన్లు, సిమ్‌కార్డులు అందుకుంటారన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని