Rajasthan: సీఎంగా భజన్‌లాల్‌ శర్మ ప్రమాణం.. పక్కపక్కనే విరోధులు!

రాజస్థాన్‌ నూతన సీఎంగా భజన్‌లాల్‌ శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్‌ రాజకీయాల్లో విరోధులుగా భావించే మాజీ సీఎం అశోక్‌ గహ్లోత్‌, కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌లు పక్కపక్కనే కూర్చోవడం గమనార్హం.

Updated : 15 Dec 2023 13:30 IST

జైపుర్‌: రాజస్థాన్‌ (Rajasthan) నూతన ముఖ్యమంత్రిగా భజన్‌లాల్‌ శర్మ (Bhajan Lal Sharma) ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడి ఆల్బర్ట్‌ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్ర ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీ, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సీనియర్‌ నేత వసుంధర రాజే తదితరులు హాజరయ్యారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్‌లో భాజపా అధికారంలోకి వచ్చింది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భజన్‌లాల్‌ శర్మ సీఎంగా ఎంపికయ్యారు. ఇక దియా సింగ్‌ కుమారి, ప్రేమ్‌ చంద్‌ బైర్వాలు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు.

రాజస్థాన్‌ సీఎం భజన్‌లాల్‌ శర్మ.. తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేకు పగ్గాలు

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ సీఎం అశోక్‌ గహ్లోత్‌ (Ashok Gehlot) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాజస్థాన్‌ రాజకీయాల్లో విరోధులుగా భావించే గహ్లోత్‌, కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌లు పక్కపక్కనే కూర్చోవడం గమనార్హం. సంజీవని కుంభకోణం (Sanjivani scam)లో షెకావత్‌ హస్తం ఉందంటూ గహ్లోత్‌ అనేక సందర్భాల్లో ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో గహ్లోత్‌పై దిల్లీ కోర్టులో షెకావత్‌ పరువు నష్టం దావా కూడా వేశారు. ఈ క్రమంలోనే కొత్త సీఎం ప్రమాణ స్వీకార సమయంలో వీరు మాట్లాడుకొంటూ కనిపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని