ఎన్నికల వేళ రాజస్థాన్‌లో.. పీసీసీ అధ్యక్షుడు కుమారులకు సమన్లు

Rajasthan: నేడు రాజస్థాన్‌ పీసీసీ అధ్యక్షుడు కుమారులకు ఈడీ సమన్లు ఇచ్చింది. కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌ కుమారుడికి కూడా ఫెమా (FEMA) నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన కేసులో దర్యాప్తు సంస్థ సమన్లు ఇచ్చింది. 

Published : 02 Nov 2023 16:08 IST

జైపుర్: మరి కొద్దిరోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్థాన్‌ (Rajasthan)లో ఈడీ(ED) సోదాలు కలకలం రేపుతున్నాయి. పీసీసీ(Congress) అధ్యక్షుడు గోవింద్‌ సింగ్‌ డోటాస్రా కుమారులకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్( Enforcement Directorate) సమన్లు జారీచేసింది. పరీక్షా పత్రం లీక్‌ (exam paper leak)కు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసు(money laundering case) దర్యాప్తులో భాగంగా వారికి ఈ నోటీసులు అందాయి.

కొద్దిరోజుల క్రితం రాజస్థాన్‌ కాంగ్రెస్‌(Congress) అధ్యక్షుడు గోవింద్‌ సింగ్‌ డోటాస్రా నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్ (Ashok Gehlot) కుమారుడు వైభవ్‌ (Vaibhav Gehlot)కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఫెమా(FEMA) నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన కేసులో వైభవ్‌కు ఈ సమన్లు అందినట్లు తెలిసింది.

ఈడీ విచారణకు కేజ్రీవాల్‌ గైర్హాజరు.. సమన్లు వాపస్‌ తీసుకోవాలని లేఖ..!

ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఈడీ ఇలా సమన్లు ఇవ్వడం, సోదాలు చేపట్టడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈ చర్యలపై ఇదివరకు ముఖ్యమంత్రి గహ్లోత్‌ ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ కేంద్రంపై ధ్వజమెత్తారు.  200 శాసనసభ స్థానాలున్న రాజస్థాన్‌లో నవంబరు 25న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 3న ఫలితాలను ప్రకటించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని