kidney surgery: సర్జరీలో తప్పిదం.. బాగున్న కిడ్నీని తొలగించి..!

సర్జరీ సమయంలో దెబ్బతిన్న కిడ్నీకి బదులుగా ఆరోగ్యంగా ఉన్న కిడ్నీని వైద్యులు తొలగించారు. దీంతో ఆమె ప్రాణాలకే ముప్పు వాటిల్లింది.

Published : 29 May 2024 00:04 IST

జైపుర్‌: వైద్యుల నిర్లక్ష్యం ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. శస్త్రచికిత్స సమయంలో దెబ్బతిన్న కిడ్నీకి బదులు.. బాగున్న కిడ్నీని తొలగించారు. దీంతో ఆ పేషంట్‌ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. రాజస్థాన్‌ (Rajasthan)లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..

కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న మహిళకు జైపుర్‌లోని ఝుంఝు జిల్లాలో ఓ ప్రైవేటు ఆస్పత్రి బృందం ఇటీవల శస్త్రచికిత్స నిర్వహించింది. అయితే.. సర్జరీ సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దెబ్బతిన్న కిడ్నీకి బదులు బాగున్న  కిడ్నీని తొలగించి సర్జరీ పూర్తి చేశారు. కొన్ని రోజులు గడిచినా మహిళకు ఆరోగ్యం కుదుటపడకపోవడంతో మరో ఆస్పత్రికి వెళ్లారు. ఆమెకు పరీక్షలు నిర్వహించగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

మంచుకొండల్లో మృత్యు ఘంటికలు.. ఎవరెస్టులో 8కి చేరిన మరణాలు!

వైద్యుల నిర్లక్యం వల్ల ఆమె ప్రాణాలకే ముప్పు వాటిల్లింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి చేరడంతో ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు చేపట్టింది. క్లినికల్‌ లైసెన్స్‌ను రద్దు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు