ప్రతి సైనికుడు కుటుంబ సభ్యుడే.. ఆర్మీ జోలికి వస్తే ఊరుకోం: రాజనాథ్‌ వ్యాఖ్య

ప్రతి సైనికుడు తమకు కుటుంబ సభ్యుడితో సమానమని, ప్రతి భారతీయుడి భావన ఇదేనని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్(Rajnath Singh) అన్నారు. 

Updated : 27 Dec 2023 16:04 IST

శ్రీనగర్‌: ఇటీవల జమ్మూ కశ్మీర్‌(Jammu Kashmir)లో పూంఛ్‌(Poonch Attack) జిల్లాలో జవాన్లు ప్రయాణిస్తున్న రెండు సైనిక వాహనాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భద్రతా పరిస్థితులను సమీక్షించేందుకు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) బుధవారం జమ్మూలో పర్యటించారు. ఈ సందర్భంగా సైనికులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

‘దేశంలోని ప్రతి సైనికుడు మన కుటుంబ సభ్యుడితో సమానం. ప్రతి భారతీయుడి భావన ఇదే. మీకు చెడుచేయాలని చూస్తే సహించేది లేదు. అలాంటి దాడుల్ని అడ్డుకోవడంలో భద్రతా, నిఘా సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయి. మీరంతా ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటారని తెలుసు. మీ ధైర్యసాహసాలు, త్యాగాలు వెలకట్టలేనివి. ఒక సైనికుడు అమరుడైతే.. మేమిచ్చే పరిహారం ఆ నష్టాన్ని పూడ్చలేదు. ప్రభుత్వం మీ వెంటే ఉంటుంది. మీ భద్రత, సంక్షేమం మాకు అధిక ప్రాధాన్యం.’ అని మంత్రి అన్నారు.

‘‘సముద్రంలో ఎక్కడ దాక్కున్నా.. వారిని వేటాడతాం!’’

కాగా, ఇటీవలి ఆపరేషన్లలో లోపాలకు సంబంధించి బ్రిగేడియర్ స్థాయి అధికారి విచారణను ఎదుర్కొంటున్నారు. మరోపక్క పూంఛ్‌ జిల్లాలో కస్టడీలో ఉన్న ముగ్గురు పౌరులు మృతి చెందిన ఘటనలో ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది. మరోపక్క సైనిక వాహనాలపై దాడి వంటి ఘటనల నేపథ్యంలో కేంద్రమంత్రి పర్యటన జరుగుతోంది. జమ్మూలోని రాజ్‌భవన్‌లో ఉన్నతస్థాయి భద్రతా సమావేశానికి ఆయన అధ్యక్షత వహించనున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని