Lok Sabha Elections: ఏకంగా ఎనిమిదిసార్లు ఓటేసి.. యూపీలో యువకుడి బాగోతం!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఓ యువకుడు ఏకంగా ఎనిమిది సార్లు ఓటేయడం గమనార్హం.

Published : 21 May 2024 00:05 IST

లఖ్‌నవూ: ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం.. ఒక్క ఓటుతో ప్రభుత్వాలు కూలిపోయిన సందర్భాలున్నాయి. అయితే, లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) నాల్గో విడత పోలింగ్‌లో ఓ యువకుడు చేసిన పని అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. అతడు ఒకే పోలింగ్‌ కేంద్రంలో ఏకంగా ఎనిమిది సార్లు ఓటేయడం గమనార్హం. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌ (Farrukhabad) లోక్‌సభ నియోజకవర్గంలో ఈ వ్యవహారం వెలుగుచూసింది. ఈ బాగోతాన్ని అతడు తన ఫోన్‌లో చిత్రీకరించాడు. ప్రతీసారి ఒక ప్రధాన పార్టీ అభ్యర్థికే ఓటేస్తున్నట్లు కనిపిస్తోన్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అతడు మైనర్‌ అని.. అసలు ఓటు హక్కే లేదంటూ కూడా విమర్శలు వెల్లువెత్తాయి.

మళ్లీ వచ్చేది మోదీ సర్కార్‌.. పీవోకే విలీనం పక్కా: అమిత్‌ షా

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ఈ వీడియోను ‘ఎక్స్‌’లో షేర్‌ చేస్తూ.. భాజపాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల సంఘం ఈ చర్యను తీవ్రంగా పరిగణించి.. సంబంధిత పోలింగ్‌ కేంద్రం అధికారులపై చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి.. ప్రజాస్వామ్యాన్ని భాజపా దోచుకోవాలనుకుంటోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారంపై యూపీ సీఈవో స్పందిస్తూ.. ఆ సమయంలో విధుల్లో ఉన్న అధికారులను సస్పెండ్‌ చేస్తామని తెలిపారు. మరోసారి రీపోలింగ్‌కు ఏర్పాట్లు చేస్తామన్నారు. మరోవైపు.. ఆ యువకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని