Scam: ‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్‌ వైరల్‌

క్రికెట్‌ అభిమానులు జాగ్రత్తగా ఉండండి..! చెన్నై ఆటగాడు ధోనీ (MS Dhoni) పేరుతో ఓ ఇన్‌స్టా మెసేజ్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. 

Published : 25 Apr 2024 17:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల కాలంలో ఆన్‌లైన్‌ మోసాలు (Online Frauds) విపరీతంగా పెరిగిపోతున్నాయి. తెలిసిన వ్యక్తులుగా నమ్మించి సైబర్‌ నేరగాళ్లు మన నుంచి డబ్బులు దోచుకుంటున్న ఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఏకంగా ప్రముఖుల పేర్లతోనే మోసాలకు తెరతీశారు. తాజాగా టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ (MS Dhoni) డబ్బులు అడుగుతున్నట్లుగా ఓ మెసేజ్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఎంఎస్‌ ధోనీ పేరుతో ‘mahi77i2’ అనే ఇన్‌స్టా ఐడీ నుంచి ఈ మెసేజ్‌లు పంపిస్తున్నారు. ‘‘నేను ధోనీ. ప్రైవేట్‌ అకౌంట్‌ నుంచి మెసేజ్‌ చేస్తున్నా. నేను రాంచీ శివారులో ఉన్నా. వ్యాలెట్‌ మర్చిపోయి వచ్చా. నాకు రూ.600 ఆన్‌లైన్‌లో పంపిస్తారా? నేను ఇంటికి వెళ్లగానే మీకు డబ్బు తిరిగి పంపిస్తా’’ అని అందులో ఉంది. నమ్మించడానికి ధోనీ సెల్ఫీని కూడా పంపించారు.

విజయ్‌ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే

ఈ ఖాతా.. ధోనీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీ ‘mahi7781’ పేరును పోలి ఉండటమే గాక.. డిస్‌ప్లే ఇమేజ్‌లో జాతీయజెండా కన్పించింది. మహీ అధికారిక ఖాతాకు కూడా ఇదే ఇమేజ్‌ ఉండటంతో క్రికెటరే మెసేజ్‌ చేసేశాడని సులువుగా నమ్మే అవకాశముంది. సైబర్‌ నేరగాళ్లు తనకు పంపించిన ఈ మెసేజ్‌ను ఓ నెటిజన్‌ స్క్రీన్‌షాట్‌ తీసి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. ఇలాంటి మోసాలపై జాగ్రత్తగా ఉండాలని సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని