Sharad Pawar: ‘మరో పుతిన్‌ తయారవుతున్నారు’.. మోదీపై శరద్‌ పవార్‌ విమర్శలు

మాజీ ప్రధానులపై మోదీ ఆరోపణలు చేయడంపై ఎన్సీపీ (శరద్‌చంద్ర పవార్‌) అధినేత శరద్‌ పవార్‌ మండిపడ్డారు.

Published : 22 Apr 2024 17:31 IST

ముంబయి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi)పై ఎన్సీపీ (శరద్‌చంద్ర పవార్‌) అధినేత శరద్‌ పవార్‌ (Sharad Pawar) విమర్శలు గుప్పించారు. నవభారత నిర్మాణం కోసం మాజీ ప్రధానులు కృషి చేస్తే.. ప్రధాని మోదీ మాత్రం ఇతరులను విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. ఎన్నికల నేపథ్యంలో భాగంగా అమరావతిలో ఏర్పాటుచేసిన ప్రచారంలో పాల్గొన్న శరద్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘మాజీ ప్రధానులైన జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, మన్మోహన్‌సింగ్ నవ భారతాన్ని నిర్మించేందుకు ఎంతో కృషి చేశారు. నెహ్రూ చేసిన కృషి చరిత్ర పుటలో నిలిచింది. అది ఎవరూ మరచిపోలేరు. కానీ ప్రస్తుత ప్రధాని మోదీ మాత్రం ఇతరులను విమర్శిస్తున్నారు. గత పదేళ్లలో తన ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో చెప్పడం లేదు’’ అని ఆరోపించారు.

కోర్సు ఎందుకు.. హైస్కూల్‌ తర్వాతే లా ప్రాక్టీస్‌ చేయండి: సుప్రీం ఆగ్రహం

‘‘రాజ్యాంగాన్ని మార్చడం గురించి కొందరు భాజపా నేతలు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. ప్రధాని ప్రజల్లో భయాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తీరును అనుకరిస్తున్నారు. భారత్‌లో మరో పుతిన్‌ తయారవుతున్నారు. ఇది ఆందోళనకరం. దేశంలో నిరంకుశ పాలనను మీరంతా అనుమతించొద్దు’’ అని ప్రజలను కోరారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని