విదేశాలకు నర్సుల వలసలు.. ప్రజారోగ్యంపై వైద్య నిపుణుల ఆందోళన

దేశాన్ని నర్సుల కొరత వేధిస్తోంది. వారు విదేశాలకు వలస వెళ్లడం ఈ పరిస్థితికి దారితీసింది. ఇది దేశ ప్రజల ఆరోగ్య సంరక్షణపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Published : 23 May 2024 00:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అనారోగ్యం నుంచి కోలుకునేలా చేయడంలో వైద్యుల పాత్ర ఎంత ముఖ్యమో.. నర్సులకీ అంతే ప్రాధాన్యం ఉంది. వైద్యరంగానికి వారు చేసే సేవ వెల కట్టలేనిది. అయితే.. భారత్‌ను నర్సుల కొరత వేధిస్తోంది. నానాటికీ వారి సంఖ్య తగ్గడంపై వైద్య నిపుణుల బృందం ఆందోళన వ్యక్తం చేసింది. విదేశాలకు వలస వెళ్లడమే వారి సంఖ్య తగ్గడానికి ముఖ్య కారణమని వెల్లడించారు. 

ఇది దేశ ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చడానికి తీవ్ర అంతరాయాన్ని కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు. దేశంలో నమోదు చేసుకున్న నర్సింగ్‌ సిబ్బంది సంఖ్య 33 లక్షలుగా ఉంది. కానీ, 140కోట్లకుపైగా జనాభా కలిగిన దేశానికి ఈ సంఖ్య సరిపోదని అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ గిర్ధర్ గ్యానీ పేర్కొన్నారు. రెగ్యులేటరీ బాడీ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ గణాంకాల్లో ఈ విషయం వెల్లడైందని తెలిపారు. 

నా వ్యక్తిగత ఫొటోలు లీక్‌ చేసేందుకు కుట్రలు: స్వాతి మాలీవాల్‌ సంచలన ఆరోపణలు

విదేశాలకు వలస వెళ్లడంతో నర్సుల కొరత వేధిస్తోందని.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సమస్యను పరిష్కరించవచ్చని పేర్కొన్నారు. వారికి మన దేశంలోనే మెరుగైన శిక్షణ అందించవచ్చని సూచించారు. వాస్తవానికి 1000 మంది జనాభాకు 1.96 శాతం నర్సులు అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సిఫార్సు చేసింది. కానీ, ప్రస్తుతం భారత్‌లో ఈ జనాభాకు కేవలం ముగ్గురు నర్సులు మాత్రమే సేవలందింస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించడంపై వైద్య నిపుణుల బృందం కొన్ని సూచనలు చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు