Maharashtra: ఖైదీలకు స్మార్ట్‌ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?

మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్‌ కార్డులను జారీ చేసింది.  

Published : 18 Apr 2024 00:04 IST

ముంబయి: జైల్లో ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు స్మార్ట్‌ కార్డులను జారీ చేసింది. ఛత్రపతి శంభాంజీనగర్‌లోని సెంట్రల్‌ జైలులో దాదాపు 650 మంది ఖైదీలకు వారి కుటుంబ సభ్యులు, న్యాయవాదులతో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను పంపిణీ చేసినట్లు ఓ జైలు అధికారి పేర్కొన్నారు. వీటి ద్వారా ఖైదీలు వారానికి మూడుసార్లు, ఆరు నిమిషాల పాటు తమ వారికి ఫోన్‌ చేసి మాట్లాడే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు.

‘‘జైలులో ఉంటున్న ఖైదీల కుటుంబసభ్యులు ఆర్థిక పరిస్థితుల కారణంగా వారిని కలవడానికి రాలేకపోతున్నారు. అందువల్ల హర్సుల్ జైలులోని 650 మంది ఖైదీలకు స్మార్ట్ కార్డ్‌లు అందించాము. వీటి ద్వారా వారు తమ కుటుంబసభ్యులతో మాట్లాడుకోవచ్చు’’ అని జైలు అధికారులు తెలియజేశారు. అయితే ఖైదీలు ముందుగా అధికారులకు ఇచ్చిన నంబర్లకే కాల్‌ చేసుకోవాలా, లేదంటే ఎవరితో అయినా మాట్లాడవచ్చా అనే విషయాన్ని వారు ధ్రువీకరించలేదు. ఈ సదుపాయం ఖైదీలతో పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నవారికి కూడా జైలు ప్రాంగణంలో అందుబాటులో ఉండనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని