Aircraft: బెంగళూరులో ఎయిర్‌క్రాఫ్ట్‌ రికవరీ ట్రైనింగ్‌ స్కూల్‌.. దక్షిణాసియాలోనే మొట్ట మొదటిది!

రన్‌ వేపై ప్రమాదాలకు గురయిన విమానాలను సత్వరమే తొలగించేందుకు శిక్షణ పొందిన సిబ్బంది అవసరం. అందుకోసం బెంగళూరులో (Bengaluru) ఎయిర్‌క్రాఫ్ట్‌ రికవరీ ట్రైనింగ్‌ స్కూల్‌ ఏర్పాటైంది. 

Published : 09 Oct 2023 19:53 IST

బెంగళూరు: బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (బీఐఏఎల్‌) ఆధ్వర్యంలో నూతన ఎయిర్‌క్రాఫ్ట్‌ రికవరీ ట్రైనింగ్‌ స్కూల్‌ ఏర్పాటైంది. దక్షిణాసియాలో ఏర్పాటైన ఈ మొట్టమొదటి పాఠశాలలో రన్‌ వేపై మరమ్మతులకు గురై నిలిచిపోయిన విమానాలను వేగంగా ఎలా పక్కకు తొలగించాలో శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ కార్యక్రమం కోసం జర్మనీకి చెందిన ఓ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ సంస్థ ఇంటర్నేషనల్‌ సివిల్‌ ఏవియేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఐసీఏవో) ఆమోదించిన ‘ట్రైన్‌ఎయిర్‌ ప్లస్‌’ కార్యక్రమాన్ని అందిస్తుంది. 

కేంద్ర ప్రభుత్వం చేతికి స్విస్‌ బ్యాంకు ఖాతాదారుల ఐదో జాబితా

ప్రస్తుతం దేశంలోని అనేక విమానాశ్రయాల్లో రన్‌ వేలపై ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదానికి గురైన విమానాలను నైపుణ్యవంతంగా పక్కకు తొలగించే సిబ్బంది కొరత ఉంది. దాంతో ఇతర విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. అలాగే విమానాల ప్రయాణం ఆలస్యమవుతోంది. ఇలాంటి ఘటనలు కొన్నిసార్లు ప్రమాదానికి కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కోడ్ ‘ఎఫ్‌’ రికవరీ ఎయిర్‌క్రాఫ్ట్‌ పరికరాలతో స్కూల్‌ను ప్రారంభించామని బీఐఏఎల్‌ ఎండీ, సీఈవో హరి మరార్‌ తెలిపారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఇక్కడ శిక్షణ కొనసాగుతుందని ఆయన చెప్పారు. ఎయిర్‌క్రాఫ్ట్‌ రికవరీ ట్రైనింగ్‌ స్కూల్‌లో వివిధ రకాల శిక్షణ కార్యక్రమాలుంటాయి. కనీసం ఐదు రోజులపాటు ఇక్కడ శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని