SpiceJet: ఏడు గంటలు ఆలస్యంగా ఎయిర్‌పోర్ట్‌కు విమానం.. ఆందోళనకు దిగిన ప్రయాణికులు

పట్నాకు వెళ్లాల్సిన విమానం ఏడు గంటలు ఆలస్యంగా దిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే అధికారులతో గొడవకు దిగారు.

Updated : 02 Dec 2023 14:22 IST

దిల్లీ: దిల్లీ (Delhi) నుంచి పట్నా (Patna)కు వెళ్లాల్సిన విమానం ఏడు గంటల ఆలస్యంగా ఎయిర్‌పోర్టుకు రావడంపై ప్రయాణికులు మండిపడ్డారు. ఈ ఘటన శుక్రవారం దిల్లీ విమానాశ్రయం (Delhi airport)లో చోటు చేసుకొంది. వివరాల్లోకి వెళితే..

స్పైస్‌జెట్‌కు చెందిన SG-8721 విమానం దిల్లీ నుంచి పట్నాకు బయలుదేరాల్సి ఉంది. విమానం కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. విమానం ఎంతకీ రాకపోవడంతో వారంతా ఆందోళనకు గురయ్యారు. ఈ విషయంపై అక్కడి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఎయిర్‌పోర్టులో గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై స్పందించిన ఎయిర్‌పోర్టు అధికారులు ప్రయాణికులతో మాట్లాడి పరిస్థితిని అదుపు చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఇదేం పెళ్లిరా బాబూ!

అయితే, విమానం ఆలస్యం కావడంపై ఎయిర్‌లైన్స్‌ స్పందించింది. ‘‘నిన్న రాత్రి షెడ్యూల్‌లో మార్పులు చేయాల్సి వచ్చింది. ఆలస్యంపై ముందుగానే ప్రయాణికులకు తెలియజేశాం. దీని ప్రకారం తమ ప్రయాణాన్ని ప్లాన్‌ చేసుకోవాలని కోరాం’’ అని ఓ ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా.. ఇటీవల హైదరాబాద్‌ నుంచి దిల్లీ వెళ్లాల్సిన స్పైస్‌ జెట్‌ విమానం మూడు గంటలకు పైగా ఆలస్యమైంది. దీంతో సహనం కోల్పోయిన ప్రయాణికులు ధర్నాకు దిగారు. సాంకేతిక లోపం కారణంగా సర్వీస్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికుల కోసం మరో విమానం ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని