Vijaya Dashami: ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని, తెలుగు రాష్ట్రాల సీఎంల దసరా శుభాకాంక్షలు

దేశవ్యాప్తంగా ప్రజలందరూ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ సహా పలువురు రాజకీయ ప్రముఖులు దేశ ప్రజలకు......

Updated : 15 Oct 2021 12:31 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా ప్రజలందరూ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ సహా పలువురు రాజకీయ ప్రముఖులు దేశ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని దసరా సూచిస్తుందని.. నైతికత, మంచితనం, ధర్మమార్గంలో నడిచేందుకు మనందరికీ ఈ పండగ స్ఫూర్తినిస్తుందని రాష్ట్రపతి అన్నారు. దేశప్రజలకు సుఖ సంతోషాలను అందించాలని కోరుకుంటున్నట్లు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆకాంక్షించారు.

దసరా ఇచ్చే సందేశం ఏమిటంటే..: వెంకయ్యనాయుడు

దేశప్రజలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ‘సత్యవాక్ పరిపాలకుడైన శ్రీ రామచంద్రుని ఆదర్శవంతమైన, స్ఫూర్తివంతమైన జీవితాన్ని, ఆ పురుషోత్తముని జీవితం నుంచి మనకు లభించే మార్గదర్శనాన్ని దసరా పండగ మనకు తెలియజేస్తుంది. చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తుచేసుకుని సానుకూల దృక్పథంతో ముందుకెళ్లాలని మనకు చెబుతుంది. ఈ పండగ మనందరి జీవితాల్లోకి సమృద్ధితోపాటు సుఖశాంతులు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విటర్‌లో పేర్కొన్నారు.

* ఇక భారత ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. వీరితోపాటు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కూడా దేశ ప్రజలకు దసరా పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.

రాష్ట్ర ప్రజలకు శుభాలు కలగాలి: జగన్‌

* విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా నిర్వహించుకుంటున్నామని పేర్కొంటూ ట్వీట్ చేశారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రప్రజలకు సకల శుభాలు, విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా కొరుకుంటున్నట్టు తెలిపారు.

తెలంగాణకు ఇదో ప్రత్యేక వేడుక: కేసీఆర్‌

* తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్‌ దసరా శుభాకాంక్షలు చెప్పారు. ‘‘తెలంగాణకు దసరా ఓ ప్రత్యేక వేడుక. లక్ష్యసాధనలో విశ్రమించకూడదనేది దసరా స్ఫూర్తి. చెడుపై మంచి విజయానికి సంకేతమే విజయదశమి. అందరికీ ఆరోగ్యం, సిరిసంపదలు కలగాలని ప్రార్థిస్తున్నా’’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు