Fact Check: పుతిన్‌ పేరిట తప్పుడు వీడియో ప్రచారం.. అసలేం జరిగిందంటే!

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారత విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్‌ గంగ’ కార్యక్రమం చేపట్టింది. ఇందుకు సహకరించాలని ఇటీవల ప్రధానమంత్రి

Published : 10 Mar 2022 01:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారత విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్‌ గంగ’ కార్యక్రమం చేపట్టింది. ఇందుకు సహకరించాలని ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. రష్యా, ఉక్రెయిన్‌ అధ్యక్షులు పుతిన్‌, జెలెన్‌స్కీలకు సోమవారం స్వయంగా ఫోన్‌చేసి అభ్యర్థించారు. ఈ క్రమంలోనే రష్యా మానవతా కారిడార్లు తెరవగా.. సరిహద్దుల్లోని సుమీ నగరంలో చిక్కుకుపోయిన భారత విద్యార్థులు అక్కడి నుంచి బయటపడ్డారు. ఈ పరిణామాల తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పేరుతో భారత్‌లో ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. 

భారత విద్యార్థులను తీసుకొచ్చేందుకు వెళ్లిన ఓ ఎయిరిండియా విమానంలోకి పుతిన్‌ స్వయంగా వెళ్లి విద్యార్థులతో మాట్లాడారని పేర్కొంటున్న ఓ వీడియో నిన్నటి నుంచి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. అయితే, ఇది తప్పుడు ప్రచారమని తాజాగా తేలింది. ఆ వీడియోలో కన్పిస్తున్నది రష్యా అధ్యక్షుడు కాదని, రొమేనియాలో భారత రాయబారి రాహుల్‌ శ్రీవాస్తవ అని తేలింది. 

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను ప్రారంభించిన తర్వాత ఆ దేశ గగనతలాన్ని మూసివేశారు. దీంతో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత పౌరులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ‘ఆపరేషన్‌ గంగ’ చేపట్టారు. ఉక్రెయిన్‌లో ఉన్న భారత పౌరులను రోడ్డు మార్గం ద్వారా సరిహద్దు దాటి పోలండ్‌, రొమేనియా వంటి దేశాలకు తరలించి అక్కడి నుంచి విమానాల్లో స్వదేశానికి తీసుకొస్తున్నారు. అలా ఫిబ్రవరి 26న రొమేనియా నుంచి ఓ విమానం బయల్దేరుతుండగా.. అక్కడి భారత రాయబారి రాహుల్‌ శ్రీవాస్తవ విమానంలోని విద్యార్థులతో మాట్లాడి ధైర్యం నింపారు. ఈ వీడియోను ఆ రోజు భారత సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది కూడా. ఆ వీడియోనే ఇప్పుడు పుతిన్‌ పేరిట ప్రచారం అవుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని