Bomb threats: బాంబు బెదిరింపులు.. వణుకుతున్న బెంగళూరు!

బెంగళూరులో బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. గతంలో పాఠశాలలకు మెయిల్స్‌ రాగా..  నేడు నగరంలోని ప్రముఖ హోటళ్లుకు వచ్చాయి. 

Updated : 23 May 2024 13:51 IST

బెంగళూరు: దేశంలోని ప్రముఖ నగరాల్లో బాంబు బెదిరింపులు ఆగడంలేదు. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లోని ప్రముఖ హోటల్‌ ఒట్టేరా సహా మరో రెండింటికి బెదిరింపులు వచ్చాయి. ఒక ఈ-మెయిల్‌ అడ్రస్‌ నుంచి ఇవి వచ్చినట్లు ఆయా యాజమాన్యాలు తెలిపాయి. నేడు ఆ హోటళ్లు పేల్చివేస్తామని దీనిలో హెచ్చరించారు.

సమాచారం అందుకున్న భద్రతా బలగాలు రంగంలోకి దిగి ముమ్మర తనిఖీలు చేపట్టాయి. వీటి సమీప ప్రాంతాల్లో భారీ స్థాయిలో పోలీసులను మోహరించారు. ఇంతవరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులను గుర్తించలేదని.. తనిఖీలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. గతంలోనూ బెంగళూరులోని 40కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది.

కేంద్ర హోం శాఖ కార్యాలయానికి బాంబు బెదిరింపు

ఇటీవల దేశ రాజధాని దిల్లీలోని వందకు పైగా స్కూళ్లకు ఈ తరహా బెదిరింపులే వచ్చిన విషయం తెలిసిందే. నాడు అనుమానిత వస్తువులు లభ్యం కాకపోవడంతో అదంతా బూటకమని తేలింది. కొన్ని గంటల క్రితమే నార్త్‌ బ్లాక్‌లోని పోలీస్‌ కంట్రోల్ రూమ్‌కు ఈ-మెయిల్‌ బెదిరింపు వచ్చింది. కానీ, అక్కడ ఎటువంటి అనుమానిత వస్తువులు గుర్తించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని