Parliament: కొనసాగుతోన్న సస్పెన్షన్లు.. మరో ఇద్దరు ఎంపీల సస్పెన్షన్‌

లోక్‌సభ(Parliament)లో మరో ఇద్దరు విపక్ష ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు పడింది. దీంతో ఈ శీతాకాల సమావేశాల్లో ఇప్పటి వరకు ఉభయ సభల్లో సస్పెన్షన్‌కు గురైన వారి సంఖ్య 143కు చేరింది.

Updated : 20 Dec 2023 20:40 IST

దిల్లీ: లోక్‌సభ (Lok Sabha)లో డిసెంబరు 13 నాటి ఈ భద్రతా వైఫల్యం (Security Breach)పై హోం మంత్రి ప్రకటన చేయాలంటూ విపక్షాలు డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఆందోళనకు దిగిన పలువురు విపక్ష సభ్యులను సస్పెండ్‌ చేశారు.  బుధవారం మరో ఇద్దరు విపక్ష ఎంపీలపై స్పీకర్‌ వేటు వేశారు. ఈ సమావేశాల మొత్తానికి వారిని సస్పెండ్‌ చేస్తున్నట్లు తెలిపారు.

సభాపతి ఆదేశాలు ధిక్కరించిన సభ్యుల సస్పెన్షన్‌కు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మూజువాణీ ఓటుతో లోక్‌సభ ఆమోదించింది. అనంతరం స్పీకర్‌ తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఎంపీలు థామస్‌ చళికందన్, ఏఎం అరిఫ్‌పై వేటు వేశారు. ఈ శీతాకాల సెషన్ మొత్తానికి వారిని సస్పెండ్ చేశారు. పార్లమెంట్ చరిత్రలో ఒక సెషన్‌లో ఇంతమందిపై వేటువేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

పన్నూ హత్యకు కుట్ర ఆరోపణలు.. తొలిసారి స్పందించిన ప్రధాని మోదీ

లోక్‌సభలో ఇప్పటికే గతవారం 13 మందిని, సోమవారం మరో 33 మందిని సస్పెండ్ చేయగా.. మంగళవారం 49మందిపై వేటు పడింది. దీంతో దిగువ సభ నుంచి సస్పెండ్ అయిన ఎంపీల సంఖ్య 97కి చేరింది. రాజ్యసభలో ఆ సంఖ్య 46గా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని