Udhayanidhi Stalin: నా మాటలను భాజపా వక్రీకరించింది.. సనాతన వివాదంపై ఉదయనిధి

సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలకు ఉదయనిధి స్టాలిన్‌ మరోసారి వివరణ ఇచ్చుకొన్నారు. తన వ్యాఖ్యలను భాజపా, ప్రధాని మోదీ వక్రీకరించి వాడుకొన్నారని ఆరోపించారు.

Updated : 04 Dec 2023 12:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సనాతన వివాదంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ (Udhayanidhi Stalin) మరోసారి స్పందించారు. నిన్న కరూర్‌ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, భాజపాను తప్పుపట్టారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని తాను చేసిన ప్రకటనపై మరోసారి వివరణ ఇచ్చుకొన్నారు. తాను గతంలో చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ వాడుకొన్నారని ఆరోపించారు. ‘‘నేను నరమేధానికి పిలుపు ఇచ్చినట్లు ప్రధాని చెప్పారు. ఈ క్రమంలో నేను అనని మాటలు కూడా అన్నట్లు మోదీ ప్రజలకు చెప్పారు. కానీ, నేను ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలని మాత్రమే అన్నాను. దానిని వారు చిలువలు పలువలుగా వక్రీకరించారు. దీంతో దేశం మొత్తం నా వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి’’ అని పేర్కొన్నారు.

‘మిగ్‌జాం’ ఎఫెక్ట్‌.. స్తంభించిన చెన్నై

‘‘నా తలపై ఓ బాబా రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల బహుమతిని ప్రకటించారు. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో నడుస్తోంది. నాకు న్యాయస్థానాలపై నమ్మకం ఉంది. వారు క్షమాపణ చెప్పాలని కోరారు. నేను మాత్రం అటువంటిదేమీ ఉండదని చెప్పాను. నేను స్టాలిన్‌ కుమారుడిని, కలైంజ్ఞర్ మనవడిని. వారి భావజాలాన్ని మాత్రమే గౌరవిస్తానని వెల్లడించాను’’ అని ఉదయనిధి స్టాలిన్‌ స్పష్టం చేశారు.

సెప్టెంబరు నెలలో తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి మాట్లాడుతూ.. ‘‘సనాతన ధర్మాన్ని (sanatana dharma) నిర్మూలించాలి’’ అంటూ వ్యాఖ్యానించారు. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని పేర్కొన్నారు. దీనిపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది. దీంతో ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తూ 262 మంది ప్రముఖులు.. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI)కి లేఖ రాశారు. ఇందులో మాజీ న్యాయమూర్తులు, మాజీ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ఇక ఉదయనిధిపై పలు రాష్ట్రాల్లో పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని