Cabinet Meet: ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు.. మోదీ నివాసంలో కేంద్ర కేబినెట్‌ భేటీ

Union Cabinet Meet: సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌ బుధవారం సమావేశమైంది. 

Published : 05 Jun 2024 13:05 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించిన ఎన్డీయే కూటమి వరుసగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్‌ సమావేశమైంది (Union Cabinet Meeting). ప్రధాని నివాసంలో జరుగుతున్న ఈ భేటీలో కేంద్రమంత్రులు పాల్గొన్నారు.

ఈ సమావేశం అనంతరం పూర్తిస్థాయి కేంద్ర మంత్రి మండలితోనూ ప్రధాని భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ప్రభుత్వానికి ఇదే చివరి కేబినెట్‌, మంత్రిమండలి సమావేశం. ఈ భేటీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం ప్రస్తుత లోక్‌సభ రద్దుకు కేబినెట్‌ సిఫార్సు చేయనుంది.

‘ఇండియా’ మెరిపించినా.. ఎన్డీయేకే పీఠం

మంగళవారం వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో  (Lok Sabha Election Results) భాజపా 240 సీట్లతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 99 స్థానాలతో కాంగ్రెస్‌ రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. మొత్తంగా ఎన్డీయే కూటమికి 293 స్థానాలు, ఇండియా కూటమికి 233 సీట్లు దక్కాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ మార్కు (272)ను ఎన్డీయే దాటడంతో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని