Atishi: ఆతిశీజీ.. మా దగ్గర ఖాళీల్లేవ్‌: కేంద్రమంత్రి కౌంటర్‌

ఆప్‌ నాయకురాలు ఆతిశీ(Atishi) చేసిన ఆరోపణలను భాజపా తిప్పికొట్టింది.

Updated : 03 Apr 2024 10:50 IST

దిల్లీ: నెలరోజుల వ్యవధిలో భాజపాలో చేరాలని.. లేదంటే ఈడీ చేతిలో అరెస్టయ్యేందుకు సిద్ధంగా ఉండాలని తన సన్నిహితుడి ద్వారా భాజపా తనను సంప్రదించిందని దిల్లీ మంత్రి, ఆప్‌ నాయకురాలు ఆతిశీ (Atishi) సంచలన ఆరోపణ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి హర్దీప్‌ సింగ్ పురి (Hardeep Singh Puri) కౌంటర్ ఇచ్చారు.

దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఆప్ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సహా ఆ పార్టీకి చెందిన పలువురు అగ్రనేతలు అరెస్టయిన సంగతి తెలిసిందే. దీనిని ఉద్దేశించి మంత్రి స్పందించారు. ‘‘ఆమ్‌ఆద్మీ పార్టీ మొత్తం మద్యం కేసులో ఇరుక్కొంది. ఈ తరుణంలో ఆమెను మా పార్టీలో చేర్చుకొని ఇబ్బందులు సృష్టించుకోం. ఇక ఆతిశీ వంటి రాజకీయ కార్యకర్తకు మా పార్టీలో చోటులేదు’’ అని ఆ ఆరోపణలు తిప్పికొట్టారు.

దిల్లీ సీఎంగా సునీతా కేజ్రీవాల్‌?

మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆతిశీ మరికొన్ని ఆరోపణలు కూడా చేశారు. తనతో పాటు ఆప్‌ నేతలు సౌరభ్‌ భరద్వాజ్‌, దుర్గేశ్‌ పాథక్‌, రాఘవ్‌ చద్దా లోక్‌సభ ఎన్నికల ముందు అరెస్టవుతారని పేర్కొన్నారు. అయితే ఆమె మాటలను భాజపా తోసిపుచ్చింది. ‘‘తన మంత్రివర్గంలోని ఆతిశీ, సౌరభ్‌కు మద్యం కేసులో నిందితుడైన విజయ్‌ నాయర్ రిపోర్టు చేసేవారని కేజ్రీవాల్‌ చెప్పినప్పటి నుంచి.. ఆప్‌ నేతలు వారిలో వారు ఘర్షణపడుతున్నారు. ఆతిశీ తనను తాను కాపాడుకోవడానికి రాఘవ్‌ చద్దా, దుర్గేశ్ పాథక్‌ను ఇబ్బందుల్లోకి నెట్టారు’’ అని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని