UP Teacher: నేనేమీ బాధపడటం లేదు.. యూపీ టీచర్‌

యూపీలో సంచలనం సృష్టించిన టీచర్‌ వ్యహారంలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. తాను చేసిన పనికి బాధపడటంలేదని ఆమె సమర్థించుకొన్నారు.  

Updated : 27 Aug 2023 19:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లో ముజఫర్‌నగర్‌లోని ఓ ఉపాధ్యాయురాలు పాఠశాలలో చేసిన మతపరమైన వ్యాఖ్యలు, ఆమె ప్రవర్తనకు సంబంధించిన వీడియో దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై సదరు ఉపాధ్యాయురాలు స్పందించారు. తాను చేసిన పనికి ఏ మాత్రం బాధపడటం లేదని పేర్కొనడం గమనార్హం. సదరు మహిళ ఆ పాఠశాలకు ప్రధానోపాధ్యాయురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడుతూ ‘‘నేను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా  గ్రామానికి సేవలందిస్తున్నాను. వారంతా నాతోనే ఉన్నారు. చట్టాలు ఉన్నాయి.. కానీ, పిల్లలను పాఠశాలలో నియంత్రించాల్సిన అవసరం ఉంది. అందుకు ఇలాంటి చర్యలే తీసుకోవాలి’’ అని తెలిపారు. పిల్లలను నియంత్రించడానికే అటువంటి చర్యలు తీసుకొన్నట్లు ఆమె సమర్థించుకొన్నారు. 

నిదానమే ప్రజ్ఞానం

తొలుత ఈ వీడియో వైరల్‌ అయిన సమయంలో ఆమె తన తప్పును అంగీకరించారు. ఇది చాలా చిన్న విషయమని.. దీనిని పెద్దది చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తాను తప్పు చేశానని.. కానీ, అనవసరంగా ఇది పెద్ద విషయంగా మారిందని ఆ టీచర్‌ చెప్పారు. తాను దివ్యాంగురాలినని, అసైన్‌మెంట్‌ పూర్తి చేయకపోవడంతో విద్యార్థి వద్దకు వెళ్లలేక వేరే విద్యార్థులతో చెంపదెబ్బ వేయించానని పేర్కొన్నారు. ఈ ఘటనపై సీనియర్‌ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ఇప్పటికే ఆ విద్యార్థి తల్లిదండ్రులతో టీచర్‌ మాట్లాడి.. వారి బిడ్డ చదువుపై దృష్టిపెట్టాలని చెప్పినట్లు తేలిందన్నారు. సదరు టీచర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు డిస్ట్రిక్ట్‌ మేజిస్ట్రేట్‌ అరవింద్‌ మల్లప్ప బంగారి పేర్కొన్నారు. ‘‘మేము ఆ విద్యార్థి తండ్రి ఫిర్యాదు ఆధారంగా  టీచర్‌పై కేసు నమోదు చేశాం. శాఖాపరమైన చర్యలు తీసుకొంటాం’’ అని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని