అలెక్సాతో కోతులకు చెక్‌.. చిన్నారిని కాపాడిన 13 ఏళ్ల బాలిక..!

ఓ బాలిక సమయస్ఫూర్తి.. వానరాల ముప్పును తప్పించింది. సాంకేతికతను ఉపయోగించి సమస్య నుంచి బయటపడేలా చేసింది. ఎలా అంటే..?

Published : 07 Apr 2024 00:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సమస్య ఎదురైనప్పుడు అధైర్యపడిపోతే ఏం చేయాలో తోచదు. ఎటువంటి సందర్భాల్లోనైనా ధైర్యంగా ఉంటేనే సమయస్ఫూర్తితో ఆలోచించగలం. సమస్య నుంచి బయటపడగలం. ఇదే విషయాన్ని నిజం చేసి చూపించింది 13 ఏళ్ల బాలిక. అమెజాన్ వర్చువల్ వాయిస్ అసిస్టెంట్ ‘అలెక్సా’ సాయంతో కోతుల బారి నుంచి తనను, తన మేనకోడల్ని రక్షించుకుంది. ఎలా అంటే..?

నికిత అనే బాలిక ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో నివాసముంటోంది. తన మేనకోడలు వామిక (15నెలలు) తో కలసి ఆడుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా ఓ కోతుల గుంపు ఇంట్లోకి ప్రవేశించి గందరగోళాన్ని సృష్టించాయి. ఇంట్లోని వస్తువులను విసిరేసి, ఆహారాన్ని పాడుచేయడం ప్రారంభించాయి. అంతేకాకుండా వాటిలో ఓ కోతి నికిత, తన మేనకోడలు వద్దకు వచ్చింది. ఆ సమయంలో కుటుంబసభ్యులెవరూ దగ్గర లేకపోయినా భయపడలేదు.  సమయస్ఫూర్తితో ఆలోచించింది. వెంటనే ఇంట్లో ఉన్న వర్చువల్‌ వాయిస్‌ అసిస్టెంట్‌ అలెక్సా గుర్తుకువచ్చింది. అంతే ‘‘అలెక్సా.. శునకంలా మొరుగు’’ అని ఆదేశించింది. వెంటనే అలెక్సా పెద్దగా మొరిగే కుక్క శబ్దాలు చేయడం ప్రారంభించింది. దాంతో భయపడిన కోతులు అక్కడినుంచి పారిపోయాయి. 

వేసవిలో ఊటీ అందాలు చూసొస్తారా? ₹13 వేల నుంచే ప్యాకేజీ ధరలు

ఈ విషయాన్ని తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆశ్చర్యపోయారు. పిల్లలిద్దరికీ ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. నికిత సమయస్ఫూర్తికి సాంకేతికతను వినియోగించుకున్న తీరును అభినందించారు.   ఈ అనుభవాన్ని నికితా ఓ వార్తాసంస్థతో పంచుకుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు