Vote: పుట్టెడు దుఃఖంలోనూ.. ‘ఓటు’ బాధ్యత మరవలేదు

ఇంటి పెద్దదిక్కు కన్ను మూసినా.. ఓటును హక్కును మరవలేదు బిహార్‌లోని ఓ కుటుంబం. ఓటు బాధ్యతను నిర్వర్తించాకే.. అంత్యక్రియులు నిర్వహించింది. 

Published : 01 Jun 2024 17:20 IST

పట్నా: ఓటు అంటే బాధ్యత. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని నిర్వర్తించాలని.. పుట్టెడు దుఖంలో ఉన్న ఓ కుటుంబం నిరూపించింది. ఇంటి పెద్ద కన్నుమూసినా.. ఓటు వేశాకే అంత్యక్రియలకు సిద్ధమైంది. బాధ్యతను మరవని ఆ కుటుంబం ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. అసలేం జరిగిందంటే..

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బిహార్‌ (Bihar)లో నేడు పోలింగ్‌ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే జెహనాబాద్‌ నియోజకవర్గంలోని దేవ్‌కురి గ్రామంలో ఓ కుటుంబంలో విషాదం చోటుచేసుకొంది. ఒకవైపు ఎన్నికల పండగ జరుగుతుండగా.. మరోవైపు మిథిలేశ్‌ యాదవ్‌ (గ్రామస్థుడు) తల్లి (80 ఏళ్లు) ప్రాణాలు కోల్పోయింది. ఇంటి పెద్దను కోల్పోయి దుఖంలో ఉన్నా ఆ కుటుంబం తమ బాధ్యతను మరవలేదు. దీంతో కుటుంబంసభ్యులంతా ఒక నిర్ణయానికి వచ్చారు.

92 ఏళ్లలో తొలిసారి ఓటు.. వృద్ధుడి ఆనందం!

ఓటుహక్కు వినియోగించుకున్న తరువాతే ఆమె అంత్యక్రియలు నిర్వహించాలనుకున్నారు. వారు తీసుకున్న ఈ నిర్ణయం ఎంతోమందికి ప్రజాస్వామ్య ప్రాధాన్యాన్ని తెలియజేసిందనడంలో అతిశయోక్తి లేదు. కాగా.. చివరి విడతలో భాగంగా 57 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. బిహార్‌లోని ఎనిమిది స్థానాలకు నేడు ఓటింగ్‌ జరుగుతోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని