CV Ananda Bose: 72 గంటల్లో అరెస్టు చేయలేదో.. నేనే సందేశ్‌ఖాలీ వెళ్తా : బెంగాల్‌ సర్కారుకు గవర్నర్‌ అల్టిమేటం

సందేశ్‌ఖాలీలో మహిళలపై లైంగిక వేధింపుల్లో ప్రధాన నిందితుడిని 72 గంటల్లోగా అరెస్టు చేయాలంటూ గవర్నర్‌ సీవీ ఆనంద బోస్‌ దీదీ ప్రభుత్వాన్ని ఆదేశించారు. 

Updated : 27 Feb 2024 15:59 IST

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ (Sandeshkhali)లో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యవహారంలో ప్రధాన నిందితుడిని అరెస్టు చేయాలంటూ దీదీ ప్రభుత్వానికి గవర్నర్‌ సీవీ ఆనంద బోస్‌ (CV Ananda Bose) అల్టిమేటం జారీ చేశారు. నిందితుడిని 72 గంటల్లో అరెస్టు చేయాలని డెడ్‌లైన్‌ విధించారు. ఈమేరకు ఆయన మంగళవారం మీడియాకు వెల్లడించారు.

టీఎంసీ నేత షాజహాన్ షేక్‌ (Sheikh Shajahan)ను అరెస్టు చేయాలంటూ కలకత్తా హైకోర్టు ఆదేశించిన అనంతరం బోస్‌ రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. తాను ఇచ్చిన గడువులోగా నిందితుడిని అరెస్టు చేయకపోతే.. సందేశ్‌ఖాలీకి వెళ్లి అక్కడి నుంచే తన విధులు నిర్వహిస్తానన్నారు. బాధితులకు పునరావాస కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.

అంతరిక్షానికి వెళ్లే భారతీయులు వీరే.. వ్యోమగాముల పేర్లు ప్రకటించిన మోదీ

మహిళలపై గూండాలు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, వారి భూములు ఆక్రమించారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో కలకత్తా హెకోర్టు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. నిందితుడు షాజహాన్‌ షేక్‌ను అరెస్టు చేయాలని ఆదేశించింది. వారంలోగా అతడిని అరెస్టు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని