Shashi Tharoor: మోదీకి సరైన పోటీ ఎవరు..? శశిథరూర్‌ ఆసక్తికర సమాధానం

Shashi Tharoor: ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయం ఎవరంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ ఆసక్తికర సమాధానం చెప్పారు.

Updated : 03 Apr 2024 13:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. ప్రచారంలో బిజీగా ఉన్నారు కాంగ్రెస్‌ (Congress) సీనియర్‌ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor). తాజాగా ఆయనకు విలేకరుల నుంచి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఈ దేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi)కి ప్రత్యామ్నాయంగా భావిస్తున్న వ్యక్తి ఎవరో చెప్పాలంటూ జర్నలిస్టులు ఆయన్ను అడిగారు. దీనికి థరూర్ తనదైన శైలిలో బదులిచ్చారు. 

‘‘పార్లమెంటరీ వ్యవస్థలో ఈ ప్రశ్న అసంబద్ధమైనది. అధ్యక్ష వ్యవస్థల్లో మాదిరిగా మనం ఒక వ్యక్తిని ఎన్నుకోవడం లేదు. మన దేశ బహుళత్వం, వైవిధ్యం, సమ్మిళిత వృద్ధిని సంరక్షించడం కోసం రూపొందించిన విధివిధానాలను పాటించే పార్టీ లేదా సంకీర్ణ కూటమిని ఎన్నుకుంటాం. ఇక్కడ ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయం ఎవరంటే.. వ్యక్తిగత అహాన్ని పక్కనబెట్టి ప్రజల సమస్యలపై పోరాడే అనుభవజ్ఞులైన, సమర్థులైన నాయకుల బృందమే. అందులో నుంచి ఎవరిని ప్రధానిగా ఎన్నుకోవాలన్నది తర్వాతి విషయం. మన ప్రజాస్వామ్యాన్ని, భిన్నత్వాన్ని పరిరక్షించడమే ప్రథమ ప్రాధాన్యం’’ అని విలేకరులు అడిగిన ప్రశ్నకు శశిథరూర్‌ సోషల్‌ మీడియా వేదికగా సమాధానం చెప్పారు.

తిహాడ్‌ జైల్లో కేజ్రీవాల్‌కు ముప్పు.. హైఅలర్ట్‌లో గార్డ్స్‌..!

కేరళలోని తిరువనంతపురం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలుపొందిన శశిథరూర్‌.. తాజా ఎన్నికల్లో మరోసారి అక్కడి నుంచే బరిలోకి దిగారు. ఆయనపై భాజపా నుంచి కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ పోటీ చేస్తున్నారు. వామపక్షాల నుంచి పన్నియన్‌ రవీంద్రన్‌ బరిలో ఉన్నారు. దీంతో ఈ త్రిముఖ పోరు ఆసక్తికరంగా మారింది. రెండో దశలో భాగంగా ఏప్రిల్‌ 26న ఈ లోక్‌సభ నియోజకవర్గానికి పోలింగ్‌ జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు