శంకర్‌ డైరెక్షన్‌లో యశ్‌ మల్టీస్టారర్‌

‘కేజీఎఫ్‌ ఛాప్టర్‌1’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు కన్నడ నటుడు యశ్‌. దీంతో ఆయనతో సినిమాలు చేసేందుకు దర్శకులు ఆసక్తి కనబరుస్తున్నారు. టాలీవుడ్‌ దర్శకుడు పూరీ జగన్నాథ్‌, యశ్‌తో ఓ కమర్షియల్‌ చిత్రాన్ని తెరకెక్కించనున్నారంటూ కొంతకాలం క్రితం వార్తలు వచ్చిన విషయం....

Published : 12 Nov 2020 01:19 IST

చెన్నై: ‘కేజీఎఫ్‌ ఛాప్టర్‌1’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు కన్నడ నటుడు యశ్‌. దీంతో ఆయనతో సినిమాలు చేసేందుకు దర్శకులు ఆసక్తి కనబరుస్తున్నారు. టాలీవుడ్‌ దర్శకుడు పూరీ జగన్నాథ్‌, యశ్‌తో ఓ కమర్షియల్‌ చిత్రాన్ని తెరకెక్కించనున్నారంటూ కొంతకాలం క్రితం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ప్రముఖ దర్శకుడు శంకర్‌.. త్వరలో యశ్‌తో భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించనున్నట్లు కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

యశ్‌ కోసం పవర్‌ఫుల్‌ స్ర్కిప్ట్‌ సిద్ధం చేసుకున్న శంకర్‌ ఇప్పటికే.. ఆయన్ని కలిసి కథ వివరించారని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా శంకర్‌ చెప్పిన కథ నచ్చడంతో యశ్‌ కూడా వెంటనే ఓకే చేసేశారని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. దీంతో వచ్చే ఏడాది జనవరి నెలలో ఈ సినిమాని అధికారికంగా ప్రకటించనున్నారని, అలాగే ఇందులో విజయ్‌సేతుపతి కూడా నటించనున్నారంటూ వరుస కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

‘భారతీయుడు-2’ ఆగినట్లేనా..!

శంకర్‌-కమల్‌హాసన్‌ కాంబినేషన్‌లో రానున్న ‘భారతీయుడు-2’ షూటింగ్‌ కొంతకాలంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. షూటింగ్‌ సెట్‌లో జరిగిన భారీ ప్రమాదంతో ఆర్థిక నష్టం ఏర్పడిందని.. దీంతో బడ్జెట్‌ తగ్గించే ఆలోచనలో నిర్మాణ సంస్థ ఉందంటూ వార్తలు వచ్చాయి. అయితే  షూటింగ్‌ విషయంలో నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో కమల్‌, శంకర్‌ వేరే సినిమాలు చేసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నారంటూ కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ‘భారతీయుడు-2’ ఆగినట్లేనా అని అందరూ చర్చించుకుంటున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని