Aa okkati adakku: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన కామెడీ ఎంటర్‌టైనర్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే

అల్లరి నరేశ్ నటించిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ ఓటీటీలోకి వచ్చేసింది.

Published : 31 May 2024 09:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొంత విరామం అనంతరం అల్లరి నరేశ్‌ నటించిన వినోదాత్మక చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’ (Aa Okkati Adakku). ఈ చిత్రంతో మల్లి అంకం దర్శకుడిగా పరిచయమయ్యారు. పెళ్లికాని యువకుడి స్టోరీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా థియేటర్లో నవ్వులు పంచింది. ఇప్పుడీ కామెడీ ఎంటర్‌టైనర్‌ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో (Amazon Prime Video) వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోయిన్‌గా నటించగా.. జెమీ లివర్, వెన్నెల కిషోర్, రితూ చౌదరి, అరియానా తదితరులు కీలకపాత్రలు పోషించారు.

బాలకృష్ణతో నాకు మంచి అనుబంధం ఉంది: నటి అంజలి

కథేంటంటే: గణ అలియాస్‌ గణపతి (అల్లరి నరేష్‌) (Allari Naresh) ప్రభుత్వ ఉద్యోగి. సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులో పని చేస్తుంటాడు. తన చేతుల మీదుగా వందల వివాహాలు జరిపించిన అతడికి మూడు పదుల వయసు దాటినా పెళ్లి కాదు. తన కంటే ముందు.. తమ్ముడి(రవికృష్ణ)కి మేనమామ కూతురు (జెమీ లివర్‌)ను ఇచ్చి పెళ్లి జరిపిస్తాడు. ఇంట్లో వాళ్లంతా గణ కోసం ఎన్నో సంబంధాలు చూస్తారు. అతడి వయసు ఎక్కువనో.. తమ్ముడికి ముందు పెళ్లి అయిందనో రకరకాల కారణాలు చెప్పి పిల్లను ఇవ్వడానికి నిరాకరిస్తుంటారు. దీంతో చేసేదేమీ లేక ఆఖరి ప్రయత్నంగా హ్యాపీ మ్యాట్రిమోనీలో ప్లాటినం సభ్యుడిగా చేరతాడు. అక్కడ పరిచయమైన సిద్ధి (ఫరియా అబ్దుల్లా)పై మనసు పారేసుకుంటాడు. అదే మ్యాట్రిమోనీలో తన పేరు నమోదు చేసుకుని అబ్బాయిల దగ్గర డబ్బులు కొట్టేసే ఖిలాడీ లేడీ అంటూ వార్తల్లోకి ఎక్కుతుంది సిద్ధి. మరి ఆ తర్వాత ఏమైంది? నిజంగా సిద్ధి నేపథ్యమేంటి? (aa okkati adakku on amazon) ఆమె పని చేస్తున్న మ్యాట్రిమోనీ సంస్థ పెళ్లి కాని కుర్రాళ్లను ఎలా మోసం చేస్తోంది? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని