Akhil:‘ఏజెంట్‌’ సాహసాలు

అఖిల్‌ అక్కినేని స్పైగా నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఏజెంట్‌’. సురేందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. సాక్షి వైద్య కథానాయిక. మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం మనాలిలోని మంచు పర్వతాల్లో  శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది.

Updated : 30 May 2022 06:50 IST

అఖిల్‌ అక్కినేని స్పైగా నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఏజెంట్‌’. సురేందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. సాక్షి వైద్య కథానాయిక. మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం మనాలిలోని మంచు పర్వతాల్లో  శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. ఇందులో భాగంగా అఖిల్‌పై భారీ యాక్షన్‌ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన సెట్లోని కొన్ని ఫొటోలను చిత్ర బృందం సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ఆ ఫొటోల్లో అఖిల్‌ ముఖం నిండా గాయాలతో ఆసక్తికరంగా కనిపించారు. ‘‘విభిన్నమైన హైవోల్టేజ్‌ స్టైలిష్‌ స్పై థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందిస్తున్నాం. అఖిల్‌ లుక్‌, పోరాట ఘట్టాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమా ఆగస్ట్‌ 12న విడుదల కానుంది. సంగీతం: హిప్‌ హాప్‌ తమిళ్‌, కూర్పు: నవీన్‌ నూలి, ఛాయాగ్రహణం: రసూల్‌ ఎల్లోర్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని