Allu Arjun: ఆ సినిమా రెమ్యునరేషన్‌.. మా నాన్న నాకు ఇవ్వలేదు: అల్లు అర్జున్‌ పోస్ట్‌

ప్రముఖ హీరో అల్లు అర్జున్‌ తాజాగా పెట్టిన ఓ పోస్ట్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆయన ఏమన్నారంటే?

Published : 25 Dec 2023 02:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన తండ్రి, ప్రముఖ నిర్మాత అరవింద్‌ (Allu Aravind) ఓ సినిమాకి సంబంధించి రెమ్యునరేషన్‌ ఇవ్వలేదని హీరో అల్లు అర్జున్‌ (Allu Arjun) సరదాగా పేర్కొన్నారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. అసలు విషయం ఏంటంటే..? చిరంజీవి హిట్‌ చిత్రాల్లో ‘విజేత’ (Vijetha) ఒకటి. బన్నీ బాల నటుడిగా ఈ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాని అల్లు అరవింద్‌ నిర్మించారు. ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. ‘మా నాన్న నాకు రెమ్యునరేషన్‌ ఇవ్వలేదు’ అని పేర్కొన్న బన్నీ.. స్మైలీ ఎమోజీ జోడించారు. ఆయన షేర్‌ చేసిన ఫొటోలో.. ‘విజేత’ 100 రోజుల జ్ఞాపికతోపాటు అరవింద్‌ నవ్వుతూ కనిపించారు.

ఓటీటీలోకి ‘యానిమల్‌’.. ఆ షాట్స్‌ యాడ్‌ చేస్తున్న దర్శకుడు

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా బన్నీ నటించిన రెండో సినిమా ‘స్వాతిముత్యం’. మరోవైపు, హీరోగా ఎంట్రీ ఇవ్వకముందు ‘డాడీ’లో అతిథి పాత్రలో కనిపించారు. చిరంజీవి హీరోగా తెరకెక్కిన సినిమా ఇది. ప్రస్తుతం.. ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule)తో బిజీగా ఉన్నారు బన్నీ. బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్‌గా నిలిచిన ‘పుష్ప’కు సీక్వెల్‌గా రూపొందుతోంది. ఈ సినిమాలోని నటనకుగానూ ఆయన జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ పురస్కారం దక్కించుకున్న తొలి తెలుగు హీరోగా నిలిచారు. ప్రేక్షకుల అంచనాలు అందుకునేలా దర్శకుడు సుకుమార్‌ ‘పుష్ప2’ను తీర్చిదిద్దుతున్నారు. జాతర నేపథ్యంలో వచ్చే సన్నివేశంలో అల్లు అర్జున్‌ గంగమ్మ తల్లిగా కనిపించడం సినిమాకే హైలైట్‌ ఉంటుందని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించారు. అర్జున్‌ పెర్ఫామెన్స్‌ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తుందన్నారు. ఈ సినిమా నేపథ్య సంగీతం మరో స్థాయిలో ఉంటుందని, ముఖ్యంగా ఇంటర్వెల్‌ సీన్‌లో బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అదిరిపోతుందన్నారు. ఈ సినిమా 2024 ఆగస్టు 15న విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని