Animal Ott Release: ఓటీటీలోకి ‘యానిమల్‌’.. ఆ షాట్స్‌ యాడ్‌ చేస్తున్న దర్శకుడు

‘యానిమల్‌’ (Animal) ఓటీటీ రిలీజ్‌ గురించి ఆసక్తికర విషయాల్ని తెలియజేశారు దర్శకుడు సందీప్‌. ఓటీటీ వెర్షన్‌ కోసం కొన్ని సీన్స్‌ యాడ్‌ చేయనున్నట్లు తెలిపారు.

Updated : 24 Dec 2023 15:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రణ్‌బీర్‌ కపూర్ (Ranbir Kapoor) హీరోగా నటించిన సూపర్‌హిట్‌ మూవీ ‘యానిమల్‌’ (Animal). బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ కోసం సినీ ప్రియులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘యానిమల్‌’ (Animal OTT Release) ఓటీటీ రిలీజ్‌పై చిత్ర దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తాజాగా స్పందించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఇది స్ట్రీమింగ్‌ కానుందన్నారు. ‘‘యానిమల్‌’ రన్‌టైమ్‌ మూడున్నర గంటలు. ఒత్తిడి కారణంగా సుమారు తొమ్మిది నిమిషాల సన్నివేశాలను కట్‌ చేశా. ప్రస్తుతం నేను నెట్‌ఫ్లిక్స్‌ వెర్షన్‌ కోసం ఎడిటింగ్‌ చేస్తున్నా. థియేటర్‌ కోసం తొలగించిన షాట్స్‌ను ఓటీటీ వెర్షన్‌కు యాడ్‌ చేస్తున్నా’’ అని ఆయన తెలిపారు.

నా మాటలకు ఆ నటి బాధపడింది: సందీప్‌ రెడ్డి వంగా

కథేంటంటే: స్వ‌స్తిక్ స్టీల్స్ అధినేత‌, దేశంలోనే సంప‌న్నుడైన బ‌ల్బీర్ సింగ్ (అనిల్ క‌పూర్‌) త‌న‌యుడు ర‌ణ్ విజ‌య్ (ర‌ణ్‌బీర్ సింగ్‌). ఎవ‌రినైనా స‌రే ధైర్యంగా ఎదిరించే ర‌కం. చిన్నతనం నుంచే నాన్నంటే చెప్ప‌లేనంత ప్రేమ‌. కానీ, బ‌ల్బీర్ సింగ్ వ్యాపారాల‌తో బిజీగా గ‌డుపుతూ కొడుకు రణ్‌ విజయ్‌ను ప‌ట్టించుకోడు. దూకుడు మ‌న‌స్త‌త్వ‌మున్న విజ‌య్ ప‌నులు తండ్రి బ‌ల్బీర్‌సింగ్‌కి న‌చ్చ‌వు. ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు మొద‌ల‌వుతాయి. దాంతో త‌ను ప్రేమించిన గీతాంజ‌లి (ర‌ష్మిక‌)ని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోతాడు. కొన్నేళ్ల త‌ర్వాత తండ్రిపై హ‌త్యాయ‌త్నం జ‌రిగింద‌ని తెలియ‌డంతో హుటాహుటిన త‌న భార్య‌, పిల్ల‌ల‌తో ఇండియాకు వ‌స్తాడు. వ‌చ్చాక ఏం జ‌రిగింది? త‌న తండ్రిని హ‌త్య చేయాల‌నుకున్న శ‌త్రువుని విజ‌య్ ఎలా గుర్తించాడు? ఇంత‌కీ ఆ శత్రువు ఎవ‌రు? అత‌ని నుంచి కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అనే అంశాలతో ‘యానిమల్‌’ సిద్ధమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని