Allu Arjun: నా విజయానికి ఆయనే కారణం.. జాతీయ అవార్డుపై అల్లు అర్జున్ పోస్ట్‌

జాతీయ అవార్డు అందుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు అల్లు అర్జున్ పేర్కొన్నారు. అలాగే అలియా భట్‌, కృతి సనన్‌లు కూడా అవార్డు ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.

Published : 18 Oct 2023 12:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల (69th National Film Awards) ప్రదానోత్సవం దిల్లీలో అట్టహాసంగా జరిగింది. అందులో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకుని టాలీవుడ్‌ హీరో అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు. ఈ విషయంపై హర్షం వ్యక్తం చేస్తూ తన ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు.

‘జాతీయ అవార్డును అందుకోవడం గౌరవంగా భావిస్తున్నా. నాకు ఇంత గొప్ప గుర్తింపునిచ్చిన జ్యూరీకి, మంత్రిత్వ శాఖకు, భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈ అవార్డు నేను సాధించిన మైలురాయి మాత్రమే కాదు.. మన సినిమాను ఆదరిస్తూ.. సపోర్ట్‌ చేసినవారందరికీ చెందుతుంది. అలాగే దర్శకుడు సుకుమార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాలి. నా విజయానికి ఆయనే కారణం’ అని బన్నీ పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా అవార్డు విజేతలతో ఆయన దిగిన ఫొటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు. ‘ఇవి ఎంతో అందమైన, అరుదైన క్షణాలు’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు అభిమానులు స్పందిస్తూ.. బన్నీకి (Allu arjun) శుభాకాంక్షలు చెబుతున్నారు. 

వైవాహిక అత్యాచారాన్ని.. శృంగార సీన్లు అంటారా?: మెహ్రీన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకం: అలియా భట్‌

ఇక ‘గంగూభాయి కాఠియావాడి’లో అద్భుతమైన నటనకు గాను బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ (Alia bhatt) సంయుక్తంగా జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. ఈ వేడుకకు తన పెళ్లి చీరలో వచ్చి అందరినీ ఆకర్షించారు. తాజాగా ఆ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఆమె.. ‘ఈ ఫొటోలు, ఈ క్షణం, ఈ జ్ఞాపకం.. జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతాయి’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌పై బాలీవుడ్‌ ప్రముఖులు కామెంట్లు పెడుతున్నారు. 

అలాగే సంయుక్తంగా ఉత్తమ నటి అవార్డు అందుకున్న కృతి సనన్‌ (kriti sanon) కూడా ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘అతి పెద్ద మూమెంట్‌’ అని క్యాప్షన్‌ జోడించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అవార్డు విజేతలు దిగిన ఫొటోలు వైరల్‌గా మారాయి. అల్లు అర్జున్‌, అలియా భట్‌, కృతి సనన్‌ కలిసి దిగిన ఫొటో అందరినీ ఆకట్టుకుంటోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని