Allu Arjun: అందరి హృదయాలను హత్తుకుంటుంది.. ‘హాయ్‌ నాన్న’పై అల్లు అర్జున్‌ రివ్యూ

‘హాయ్‌ నాన్న’పై అల్లు అర్జున్‌ (Allu Arjun) ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా అందరి హృదయాలను హత్తుకునేలా ఉందన్నారు.

Updated : 11 Dec 2023 15:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్: నాని (Nani) హీరోగా శౌర్యువ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘హాయ్ నాన్న’ (Hi Nanna). ఇటీవల విడుదలైన ఈ చిత్రం నాని కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమాపై అల్లు అర్జున్‌ (Allu Arjun) రివ్యూ ఇచ్చారు. సినిమా అద్భుతంగా ఉందని ప్రశంసించారు.

‘‘హాయ్‌ నాన్న’ హృదయానికి హత్తుకుంది. సోదరుడు నాని తన నటనతో ఆశ్చర్యపరిచారు. ఇంతమంచి స్క్రిప్ట్‌ను అందించినందుకు టీమ్ అందరిపై గౌరవం పెరిగింది. మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) కనిపించిన ప్రతి సన్నివేశంలోనూ ఆకట్టుకున్నారు. ఆమె నటన కూడా ఆమెలానే అందంగా ఉంది. ఇక బేబీ కియారా తన క్యూట్‌నెస్‌తో ప్రేక్షకుల మనసులు దోచేసింది. అలాగే ఈ చిత్రం కోసం పనిచేసిన సాంకేతిక సిబ్బందికి అభినందనలు. దర్శకుడు శౌర్యువ్‌ తొలి చిత్రంతోనే అందరినీ ఆకట్టుకున్నారు. భావోద్వేగంతో కన్నీళ్లు తెప్పించారు. ఇలాంటి మరెన్నో సినిమాలు తీయాలని కోరుకుంటున్నా. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా కేవలం నాన్నల హృదయాలనే కాదు.. కుటుంబంలోని అందరి మనసులనూ హత్తుకుంటుంది’’ అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌కు నాని రిప్లై ఇచ్చారు. ‘‘ధన్యవాదాలు బన్నీ. మంచి సినిమాను ప్రోత్సహించడంలో మీరెప్పుడూ ముందు వరుసలో ఉంటారు’’ అని పేర్కొన్నారు.

ఈ వారం థియేటర్‌లో చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో?

ఇక డిసెంబర్‌ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘హాయ్‌ నాన్న’ మంచి వసూళ్లను సొంతం చేసుకుంటోంది. ఓవర్సీస్‌లో వన్‌ మిలియన్‌ డాలర్ల మార్క్‌ను అందుకున్న నాని తొమ్మిదో సినిమాగా నిలిచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు