Balakrishna: బాలకృష్ణను చూసి బాలీవుడ్ నటులు నేర్చుకోవాలి: పాయల్‌ ఘోష్‌

బాలకృష్ణను చూసి బాలీవుడ్‌ నటులు నేర్చుకోవాలని నటి పాయల్‌ ఘోష్ అన్నారు. ఆయనతో దిగిన ఓ ఫొటోను ఎక్స్‌లో పంచుకున్నారు.

Published : 05 Nov 2023 13:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగులో ‘ప్రయాణం’ చిత్రంతో ఆకట్టుకుంది నటి పాయల్‌ ఘోష్‌ (Payal Ghosh). ఆ తర్వాత ఎన్టీఆర్‌తో ‘ఊసరవెల్లి’లో నటించి మెప్పించింది. ప్రస్తుతం బాలీవుడ్‌ సినిమాల్లో నటిస్తోంది. అయితే ఈ అమ్మడు సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్‌లు చర్చనీయాంశమవుతుంటాయి. తాజాగా బాలకృష్ణతో దిగిన ఫొటో షేర్ చేసిన పాయల్ బాలీవుడ్‌ను ఉద్దేశించి కామెంట్ చేసింది. ప్రస్తుతం బాలకృష్ణ వరుస సినిమాలతో అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని పాయల్‌ ఘోష్‌ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘బాలకృష్ణ గారు ఈ వయసులోనూ సూపర్‌ హిట్‌ సినిమాలను అందిస్తున్నారు. బాలీవుడ్‌ నటులు ఆయన్ని చూసి నేర్చుకోవాలి’ అని ఎక్స్‌లో రాశారు.

ఇటుక ఇటుకలో అభిమానం.. ఎన్టీఆర్‌పై వినూత్న రీతిలో ప్రేమ

ఇక ఈ ఏడాది ప్రారంభంలోనే ‘వీరసింహారెడ్డి’తో హిట్‌ను అందుకున్న బాలకృష్ణ తాజాగా ‘భగవంత్‌ కేసరి’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమాను చేస్తున్నారు. నవంబర్‌ 6 నుంచి దీని రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. ప్రత్యేకంగా సిద్ధం చేసిన సెట్‌లో ఓ భారీ పోరాట ఘట్టంతో తొలి షెడ్యూల్‌ మొదలుపెట్టనున్నారు. 1980ల నేపథ్యం ఉన్న మాస్‌ యాక్షన్‌ కథాంశంతో ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో బాలకృష్ణ సరికొత్త లుక్‌తో కనిపించనున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు