Ambajipeta Marriage Band: ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌

సుహాస్‌ ప్రధాన పాత్ర పోషించిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ అయింది.

Published : 27 Feb 2024 01:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సుహాస్‌ (Suhas), శివానీ (Shivani) జంటగా నటించిన చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. దుశ్యంత్‌ కటికనేని దర్శకుడు. శరణ్య ప్రదీప్‌, నితిన్‌ ప్రసన్న కీలక పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.  ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’ (Aha) ఈ సినిమా రైట్స్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ‘త్వరలోనే మీ ముందుకు ఈ సినిమా వస్తుంది’ అంటూ సదరు సంస్థ ఇటీవల ఆడియన్స్‌లో ఆసక్తి పెంచింది. తాజాగా రిలీజ్‌ డేట్‌ను ఖరారు చేసింది. మార్చి 1 నుంచి (Ambajipeta Marriage Band ott release) ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది.

క‌థేంటంటే: అంబాజీపేట మ్యారేజి బ్యాండులో ఓ స‌భ్యుడు మ‌ల్లి (సుహాస్‌). చిర‌త‌పూడిలో త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తుంటాడు. అక్క ప‌ద్మ (శ‌ర‌ణ్య ప్ర‌దీప్‌) ఆ ఊరి స్కూల్లో టీచ‌ర్‌గా ప‌నిచేస్తుంటుంది. ఊరి మోతుబ‌రి వెంక‌ట్‌బాబు (నితిన్ ప్ర‌స‌న్న‌) వ‌ల్లే ప‌ద్మ‌కి ఉద్యోగం వచ్చిందని, వాళ్లిద్ద‌రి మ‌ధ్య అక్ర‌మ సంబంధం ఉంద‌నే వదంతు మొద‌ల‌వుతుంది. ఇంత‌లో వెంక‌ట్‌బాబు చెల్లెలు ల‌క్ష్మి (శివాని నాగారం), మ‌ల్లి ప్రేమ‌లో ప‌డ‌తారు. వెంక‌ట్‌బాబు త‌మ్ముడికి, మ‌ల్లికి మ‌ధ్య ఊళ్లో గొడ‌వ, ఆ త‌ర్వాత స్కూల్ విష‌యంలో ప‌ద్మ‌కీ, వెంక‌ట్‌బాబుకీ మ‌ధ్య వైరం మొద‌ల‌వుతుంది. అవి చిలికి చిలికి గాలివాన‌లా మార‌తాయి. ఇంత‌లో మ‌ల్లి, ల‌క్ష్మిల మ‌ధ్య ప్రేమ సంగ‌తి కూడా బ‌య‌టప‌డుతుంది. ఎలాగైనా ఆ కుటుంబంపై  ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని ఓ రోజు వెంక‌ట్‌బాబు... రాత్రి వేళ‌లో ప‌ద్మని స్కూల్‌కి పిలిపించి అవ‌మానిస్తాడు. ఆ త‌ర్వాత ఏం జరిగింది? మ‌ల్లి, ల‌క్ష్మిల ప్రేమ‌క‌థ ఎలాంటి మ‌లుపు తీసుకుంద‌నేది మిగతా కథ.

పూర్తి రివ్యూ కోసం క్లిక్‌ చేయండి..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని