Kalki: ప్రశంసలు ఎప్పటికీ ఆగవు.. ‘కల్కి’పై అమితాబ్‌ కామెంట్స్‌

‘కల్కి’పై ప్రశంసలు ఎప్పటికీ ఆగవని బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అమితాబ్ బచ్చన్‌ అన్నారు. ఇందులో బుజ్జి(వాహనం) ఓ అద్భుతమన్నారు.

Published : 24 May 2024 18:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాగ్‌ అశ్విన్‌ - ప్రభాస్‌ల కాంబోలో రానున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). గత రెండు రోజులుగా ఎక్కడ విన్నా ఈ సినిమాలోని బుజ్జి గురించే వినపడుతోంది. ఈ చిత్రంలో కీలకమైన ‘బుజ్జి’ (Bujji) అనే వాహనాన్ని అభిమానులకు పరిచయం చేయడంతో అందరూ దాని గురించే చర్చించుకుంటున్నారు. ఇక ఈ భారీ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) అశ్వత్థామ పాత్రలో పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాపై ఆయన ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

‘ఇలాంటి ప్రాజెక్ట్‌ల తుది ఫలితం ఎలా ఉంటుందో ప్రారంభానికి ముందు ఎవరూ ఊహించలేరు. రోజులు గడిచేకొద్దీ షూటింగ్‌ చేస్తున్న సమయంలో కొన్ని సన్నివేశాలు దీని విజయం గురించి సంకేతాలిస్తాయి. డైరెక్టర్‌ ఇంత అద్భుతంగా ఎలా ఆలోచించారని ఆశ్చర్యపోతారు. ఇలాంటి చిత్రాలకు వచ్చే ప్రశంసలు ఎప్పటికీ ఆగవు. ఇప్పుడు నేను మెచ్చుకున్నట్లే ఎంతోమంది దీన్ని ప్రశంసిస్తారు. ఇందులోని బుజ్జి మరో అద్భుతం. దర్శకుడి ఆలోచనలకు అది ప్రతిరూపం’ అని అన్నారు. అమితాబ్ ఈ చిత్రాన్ని ప్రశంసించడం ఇదే తొలిసారి కాదు.. గతంలోనూ దీని గురించి ఆయన మాట్లాడుతూ.. అత్యాధునిక సాంకేతికతతో రూపొందిందన్నారు. గొప్ప అనుభవాన్ని పంచిందన్నారు. ఈ చిత్రంలో అమితాబ్‌ యంగ్‌ లుక్‌లోనూ (టెక్నాలజీ వినియోగంతో) కనిపించనుండడం విశేషం.

ఇళయరాజా లీగల్‌ నోటీసులు.. స్పందించిన ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ నిర్మాత

ప్రభాస్ (Prabhas) సరసన దీపిక పదుకొణె (Deepika Padukone) నటిస్తుండగా.. సీనియర్‌ హీరో కమల్‌ హాసన్‌ విలన్‌ పాత్రలో కనిపించనున్నారు. అలాగే దుల్కర్‌ సల్మాన్‌, పశుపతి, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  ఇక ఈ సినిమా బడ్జెట్‌ రూ.700 కోట్లని కూడా సోషల్‌ మీడియాలో టాక్‌ వినిపిస్తుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని