Anweshippin Kandethum: ఓటీటీలో మరో మలయాళ థ్రిల్లర్‌.. టొవినో థామస్‌ మూవీ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

టొవినో థామస్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటించిన మలయాళ పోలీస్‌ డ్రామా ‘అన్వేషిప్పిన్‌ కండెతుమ్‌’ ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్ధమైంది.

Updated : 01 Mar 2024 16:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టొవినో థామస్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటించిన మలయాళ పోలీస్‌ డ్రామా ‘అన్వేషిప్పిన్‌ కండెతుమ్‌’ (Anweshippin Kandethum). డార్విన్‌ కురియకోస్‌ దర్శకుడు. ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో మార్చి 8వ తేదీ నుంచి మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) పోస్టర్‌ను పంచుకుంది.

ఇంతకీ కథేంటంటే: రెండు హత్య కేసులను పరిష్కరించే బాధ్యత సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆనంద్‌ నారాయణకు పోలీస్‌ డిపార్ట్‌మెంట్ అప్పగిస్తుంది. ఆ హత్యలు ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అన్న విషయాలను ఆనంద్‌ తెలుసుకున్నా, వాటిని బయటపెట్టలేని పరిస్థితి ఎదురవుతుంది. నిందితులను ఎవరినీ అరెస్ట్ చేయలేడు. ఈ క్రమంలో ఆనంద్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? తెలియాలంటే సినిమా చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని