Siva Karthikeyan: శివ కార్తికేయన్‌ మూవీ.. మూడేళ్ల తర్వాత మెగాఫోన్‌ పట్టనున్న దర్శకుడు..!

నటుడు శివ కార్తికేయన్‌ (Siva Karthikeyan) తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. స్టార్‌ దర్శకుడితో ఈ సినిమా ఉండనుందని తెలిపారు.

Published : 25 Sep 2023 15:00 IST

చెన్నై: ‘రెమో’, ‘వరుణ్‌ డాక్టర్‌’, ‘డాన్‌’ వంటి చిత్రాలతో తెలుగువారికి చేరువైన నటుడు శివ కార్తికేయన్‌ (Siva Karthikeyan). ‘మహావీరుడు’తో ఇటీవల ప్రేక్షకులను అలరించిన ఆయన తాజాగా కొత్త ప్రాజెక్ట్‌ ప్రకటించారు. ప్రముఖ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ (AR Murugadoss) డైరెక్షన్‌లో ఈ సినిమా ఉండనుందని తెలిపారు. ఈ మేరకు మురుగదాస్‌ పుట్టినరోజును పురస్కరించుకుని సోమవారం ఆయన్ని కలిసి విషెస్‌ తెలిపారు.

‘‘డియర్‌ సర్‌.. హ్యాపీ బర్త్‌డే. నా 23వ ప్రాజెక్ట్‌ కోసం మీతో కలిసి వర్క్‌ చేయడం నాకెంతో సంతోషంగా ఉంది. మీరు చెప్పిన కథ విన్నాక నా ఆనందం రెట్టింపు అయ్యింది. అన్ని విధాలుగా ఈ సినిమా నాకు ప్రత్యేకం కానుంది. షూటింగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని ట్వీట్ చేశారు.

పాటలు వద్దన్న మురుగదాస్‌.. అలా ఛాన్స్‌ దక్కించుకున్న వినాయక్‌

‘రమణ’, ‘గజినీ’, ‘తుపాకీ’, ‘కత్తి’ వంటి చిత్రాలతో దర్శకుడిగా తమిళ చిత్ర పరిశ్రమలో మంచి పేరు సొంతం చేసుకున్నారు ఏఆర్‌ మురుగదాస్‌. 2020లో విడుదలైన ‘దర్బార్‌’ తర్వాత ఆయన ఏ చిత్రానికీ దర్శకత్వం వహించలేదు. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత మురుగదాస్‌ ఈ చిత్రాన్ని ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి ఇది పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అనిరుధ్‌ స్వరాలు అందించవచ్చని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని