Atlee: ఇదొక మాస్టర్‌ పీస్‌.. ‘ది అర్చీస్‌’ టీమ్‌పై అట్లీ ప్రశంసలు

‘ది అర్చీస్‌’ (The Archies)టీమ్‌పై అట్లీ ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా తనకెంతో నచ్చిందన్నారు.

Published : 07 Dec 2023 19:23 IST

ముంబయి: ఖుషి కపూర్‌ (Kushi Kapoor), సుహనా ఖాన్‌ (Suhana Khan), అగస్త్య నంద (Agastya Nanda) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ది అర్చీస్‌’ (The Archies). జోయా అక్తర్‌ తెరకెక్కించిన ఈ సినిమా గురువారం నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి వచ్చింది. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన దర్శకుడు అట్లీ (Atlee) చిత్రబృందాన్ని మెచ్చుకున్నారు. నటీనటుల ప్రదర్శన అద్భుతంగా ఉందంటూ ట్విటర్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు.

‘‘దర్శకత్వంలో విశేష నైపుణ్యం కలిగిన జోయా అక్తర్‌.. ‘ది అర్చీస్‌’ను అద్భుతమైన మ్యూజికల్‌ చిత్రంగా తీర్చిదిద్దారు. తాను చెప్పాలనుకున్న కథను కవితాత్మకంగా తెరకెక్కించారు. ఈ సినిమా కోసం వర్క్ చేసిన నటీనటులందరి ప్రదర్శన నన్నెంతో ఆశ్చర్యానికి గురి చేసింది. సుహనాఖాన్‌ నటన ఎంతో బాగుంది. ఆమె డ్యాన్స్‌ చేసిన తీరు మైండ్‌ బ్లోయింగ్‌! ఖుషి కపూర్‌.. తన నటనతో ఆ పాత్రకు మరింత విలువ తెచ్చారు. అగస్త్యనందతోపాటు ఇతర నటీనటులందరూ సినిమా కోసం చక్కగా వర్క్ చేశారు. ఈ మాస్టర్‌ పీస్‌ను తీర్చిదిద్దడంలో భాగమైన టీమ్‌తోపాటు ఈ సినిమాని మాకు అందజేసిన నెట్‌ఫ్లిక్స్‌ బృందానికి నా అభినందనలు. ఈ సినిమా నా మదిలో చెరగని ముద్ర వేసింది. మరోసారి దీనిని చూసేందుకు ఆసక్తిగా ఉన్నా’’ అని ఆయన తెలిపారు. మరోవైపు, తన సోదరి ఖుషి కపూర్‌ను మెచ్చుకుంటూ నటి జాన్వీకపూర్‌ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ పెట్టారు. ఖుషి నటన చూడచక్కగా ఉందని.. నిజాయితీ, అందంతో బెట్టీ కూపర్ పాత్రకు ఆమె ప్రాణం పోసిందన్నారు. 

Tripti Dimri: ‘యానిమల్‌’ ఇంటిమేట్‌ సీన్‌.. త్రిప్తి ఏమన్నారంటే..?

కథేంటంటే: కాలేజీ చదువుకుంటూ ఆడుతూ పాడుతూ జీవితాన్ని గడిపేస్తుంటారు ఏడుగురు స్నేహితులు. వారికి ఓ సారి అనుకోని సమస్య ఎదురవుతుంది. తమకెంతో ఇష్టమైన ‘గ్రీన్‌ పార్క్‌’ను ధ్వంసం చేసి హోటల్‌ నిర్మించాలని కొంతమంది పెద్దలు భావిస్తారు. ‘గ్రీన్ పార్క్‌’ను కాపాడుకునేందుకు స్నేహితులందరూ ఏం చేశారు? వారికి ఎదురైన ఇబ్బందులు ఏమిటి? అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని