Balakrishna: ఓటీటీలోనూ ‘భగవంత్‌ కేసరి’ హవా.. దర్శకుడికి కారు గిఫ్ట్‌..!

బాలకృష్ణ రీసెంట్‌ బ్లాక్‌బస్టర్‌ ‘భగవంత్ కేసరి’ (Bhagavanth kesari) తాజాగా అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. స్ట్రీమింగ్‌ ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే ఈ చిత్రం అత్యధిక వ్యూస్‌తో ట్రెండింగ్‌లోకి వచ్చింది.

Updated : 27 Nov 2023 17:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘భగవంత్ కేసరి’ (Bhagavanth kesari). ఇది ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని సినీ ప్రియులంతా ఎదురుచూశారు. వాళ్ల ఎదురుచూపులకు తెరదించుతూ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఇది ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లో ఆడియన్స్‌తో ఈలలు వేయించిన ఈ చిత్రం ఓటీటీలోనూ హవా చూపిస్తోంది.

స్ట్రీమింగ్‌ మొదలైన కొన్ని గంటల్లోనే అత్యధిక వ్యూస్‌ సాధిస్తూ.. టాప్‌లో నిలిచింది. సందేశాత్మక చిత్రంగా రూపొందిన ‘భగవంత్ కేసరి’ తెలుగుతో పాటు, హిందీ, తమిళ, కన్నడం, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతూ.. అమెజాన్‌లో టాప్‌లో కొనసాగుతోంది. తెలుగు వెర్షన్‌ టాప్‌ వన్‌లో ట్రెండింగ్‌లో ఉండగా.. హిందీ వెర్షన్‌ టాప్ 3లో నిలిచింది. అలాగే గూగుల్లో అత్యధిక మంది వెతికిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని తెలుపుతూ అమెజాన్‌ పోస్టర్‌ విడుదల చేసింది.

రష్మిక - విజయ్ దేవరకొండ.. లైవ్‌లో సీక్రెట్ చెప్పిన రణ్‌బీర్‌.. నటి షాక్

ఇక ఆడపిల్లలను సింహాల్లా పెంచాలనే మంచి సందేశంతో రూపొందిన ఈ చిత్రంలోని డైలాగులకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. నేలకొండ భగవంత్‌కేసరి పాత్రలో బాలకృష్ణ తన యాక్టింగ్‌తో అదరగొట్టారు. అలాగే అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాకు ఊహించిన దాని కంటే మంచి స్పందన వచ్చింది. అలాగే విడుదలైన వారానికి  కొత్తగా పాటను యాడ్‌ చేయడంతో ప్రేక్షకులు థియేటర్‌కు క్యూ కట్టారు. ఫలితంగా రిలీజైన కొన్ని రోజులకే రూ.100కోట్ల క్లబ్‌లో చేరింది. బాలకృష్ణకు హ్యాట్రిక్‌ విజయాన్ని అందించింది.

దర్శకుడికి కానుక..

ఈ ఆనందంలో నిర్మాణ సంస్థ షైన్‌ స్క్రీన్స్‌ దర్శకుడు అనిల్‌ రావిపూడికి ఓ కారును (టయోటా) కానుకగా ఇచ్చింది. నిర్మాత సాహు గారపాటి.. అనిల్‌కు కారు కీ అందించే దృశ్యం నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని