Chiranjeevi: హిందీలోనూ ‘భోళా శంకర్‌’.. విడుదల ఎప్పుడంటే?

చిరంజీవి నటించిన తాజా చిత్రం  ‘భోళా శంకర్‌’ (Bhola Shankar). ఈ సినిమా మరికొన్ని రోజుల్లో హిందీలోనూ విడుదల కానుంది.

Published : 15 Aug 2023 10:41 IST

ముంబయి: చిరంజీవి (Chiranjeevi) హీరోగా మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భోళా శంకర్‌’. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. ఇప్పుడీ చిత్రం హిందీలోనూ విడుదలకు సిద్ధమైంది.

తెలుగులో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై వచ్చిన ఈ చిత్రాన్ని హిందీలో ఆర్కేడీ స్టూడియోస్‌ విడుదల చేయనుంది. ఆగస్టు 25న ఈ సినిమా బీటౌన్‌ ప్రేక్షకుల ముందుకు వెళ్లనుంది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్‌ హిందీ వెర్షన్‌ టీజర్‌ను విడుదల చేశారు. హిందీలో చిరంజీవికి జాకీ ష్రాఫ్‌ డబ్బింగ్‌ చెప్పారు. ఇక అన్నాచెల్లెలు అనుబంధంతో ముడిపడిన ఓ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది.  చిరంజీవి సరసన తమన్నా నటించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్‌, సుశాంత్‌, తరుణ్‌ అరోడా, మురళీ శర్మ, షాయాజీ షిండే తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

గాయాలైనా.. షూటింగ్‌లో పాల్గొన్న సంజయ్‌దత్‌?

ప్రచార కార్యక్రమాల్లో జోరు చూపిన ఈ సినిమా విడుదలయ్యాక మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. చిరంజీవి నటన, అక్కడక్కడా కొన్ని సన్నివేశాల్లో మెరుపులు తప్ప సినిమా ఏమాత్రం మెప్పించలేకపోయింది. అభిమానులు సైతం ఈ సినిమా ఫలితంపై నిరాశ పడుతున్నారు. చిరంజీవి త్వరలోనే ‘గోల్డ్‌బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ (Gold Box Entertainment) పతాకంపై ఓ సినిమా చేయనున్నారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా అది తెరకెక్కనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు