Animal: కన్నీళ్లు పెట్టుకున్న బాబీ దేవోల్‌.. వీడియో వైరల్‌

‘యానిమల్‌’ సినిమాలో విలన్‌గా ప్రేక్షకులను ఆకట్టకున్నారు బాలీవుడ్‌ నటుడు బాబీ దేవోల్‌ (Bobby Deol). ఈ సినిమా విజయం సాధించడంతో ఆయన భావోద్వేగానికి గురయ్యారు.

Published : 04 Dec 2023 11:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్: రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) - రష్మిక (Rashmika) జంటగా నటించిన చిత్రం ‘యానిమల్‌’ (Animal). సందీప్‌రెడ్డి వంగా దర్శకుడు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్‌ నటుడు బాబీ దేవోల్‌ (Bobby Deol) తన నటనతో ఆకట్టుకున్నారు.

ముంబయిలోని ఓ థియేటర్‌కు వెళ్లి ఆడియన్స్‌ను బాబీ దేవోల్ సర్‌ప్రైజ్‌ చేశారు. ‘సినిమాకు ఇంతటి విజయాన్ని అందించినందుకు ధన్యవాదాలు. ఎంతో మంది ప్రశంసిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఓ కలలా ఉంది’ అని ఆనందం వ్యక్తం చేశారు. థియేటర్‌ నుంచి బయటకు వచ్చాక కారులో వెళ్తూ తన అభిమానులను చూసి ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. మరోవైపు ఈ చిత్రంలో బాబీ దేవోల్‌ నటనను పొగుడుతూ సినీ ప్రముఖులు పోస్ట్‌లు పెడుతున్నారు.

ఈవారం థియేటర్‌/ఓటీటీల్లో.. అలరించే సినిమాలు, సిరీస్‌లివే

ఇక ఈ చిత్రం కోసం బాబీ దేవోల్‌ ఎంతో కఠోర సాధన చేశారు. తన లుక్‌ కోసం మూడు నెలలు స్వీట్లు మానేసి కఠిన డైట్‌ ఫాలో అయ్యారు. రణ్‌బీర్‌ కంటే భారీగా కనిపించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక ప్రస్తుతం ఆయన తెలుగు సినిమాలతోనూ బిజీగా మారారు. పవన్‌ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘హరిహరవీరమల్లు’లో విలన్‌గా నటిస్తున్నారు. అలాగే బాలకృష్ణ హీరోగా రూపొందనున్న సినిమాలోనూ ప్రతినాయకుడిగా కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని