Sanjay Dutt: 60 రోజులు.. రూ. 15 కోట్లు.. ఏ సినిమాకు సంజయ్‌దత్‌ అందుకున్నారంటే?

ప్రముఖ నటుడు సంజయ్‌దత్‌ ఓ తెలుగు సినిమాకి రూ. 15 కోట్ల పారితోషికం అందుకున్నారు. అదే సినిమా అంటే?

Published : 02 Aug 2023 15:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సంజయ్‌దత్‌ (Sanjay Dutt) ప్రతినాయక పాత్రలతో దూసుకెళ్తున్నారు. గతేడాది ‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2’ (KGF Chapter 2)లో అధీరగా విలనిజం చూపించి, ప్రేక్షకులను మెప్పించారు. కోలీవుడ్‌ నటుడు విజయ్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘లియో’ (Leo)లో ఆయన ఆంటోనీ దాస్ అనే నెగెటివ్‌ రోల్‌ ప్లే చేస్తున్నారు. మరోవైపు, తెలుగులో ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ (Double iSmart) చిత్రంలో ప్రతినాయకుడు బిగ్‌బుల్‌ పాత్రలో నటిస్తున్నారు. రామ్‌ పోతినేని (Ram Pothineni) హీరోగా ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh) తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ సినిమాలోని పాత్ర కోసం సంజయ్‌దత్‌ రూ. 15 కోట్ల పారితోషికం అందుకున్నారు. 60 రోజుల కాల్షీట్లకుగాను ఈ మొత్తాన్ని ఆయన తీసుకున్నారు. ఈ సినిమాలోని కీలక పాత్రకు సంజయ్‌దత్‌ న్యాయం చేయగలరనే ఆయనను ఎంపిక చేశామని, సినిమాకు ఆయన ప్రధాన ఆకర్షణగా నిలుస్తారని చిత్ర బృందం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇటీవల విడుదలైన ఆయన ఫస్ట్‌లుక్‌ ఆకట్టుకుంది. 

పెళ్లి వార్తలపై తరుణ్ క్లారిటీ

రామ్‌, పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో 2019లో వచ్చిన హిట్‌ చిత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ (iSmart Shankar)కు సీక్వెల్‌గా రూపొందుతోంది ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. ముంబయిలో ఇటీవల ఫస్ట్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ ముగిసింది. తదుపరి షెడ్యూల్‌ షూటింగ్‌ విదేశాల్లో జరగనుంది. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, భారీ బడ్జెట్‌తో చిత్రం రూపొందుతోంది. మహాశివరాత్రి కానుకగా వచ్చే ఏడాది మార్చి 8న ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. 1998లో వచ్చిన ‘చంద్రలేఖ’ (నాగార్జున హీరో) సినిమాలో సంజయ్‌ అతిథి పాత్రలో నటించి, తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. మళ్లీ ఇన్నాళ్లకు ఆయన తెలుగు సినిమాలో నటిస్తున్నారు. ‘డబుల్‌ ఇస్మార్ట్‌’తోపాటు ‘స్కంద’ (Skanda) సినిమాతో బిజీగా ఉన్నారు రామ్‌. ఈ చిత్రాన్ని దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నారు. సెప్టెంబరు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని