Tarun: పెళ్లి వార్తలపై తరుణ్ క్లారిటీ

తన పెళ్లి గురించి వస్తోన్న వార్తలపై నటుడు తరుణ్‌ (Tarun) స్పందించారు.

Published : 02 Aug 2023 13:12 IST

హైదరాబాద్‌: నటుడు తరుణ్‌ (Tarun) త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారంటూ గత కొన్నిరోజుల నుంచి వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయనకు పెళ్లి ఫిక్స్ అయ్యిందంటూ సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా తరుణ్‌ స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. నిజంగానే పెళ్లి ఫిక్స్ అయితే తానే స్వయంగా ఆ శుభవార్తను అందరితో పంచుకుంటానని స్పష్టం చేశారు.

‘ఆమె’గా మారి.. నవ్వులు పంచి.. లేడీ గెటప్‌ వేసిన హీరోలు వీరే!

‘మనసు మమత’తో బాలనటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు తరుణ్‌. బాలనటుడిగా పలు చిత్రాలకు నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. 2000లో విడుదలైన ‘నువ్వేకావాలి’తో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వరుస ప్రేమకథల్లో నటించి లవర్‌బాయ్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. 2018లో విడుదలైన ‘ఇది నా లవ్‌స్టోరీ’ తర్వాత యాక్టింగ్‌ నుంచి బ్రేక్‌ తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని