Bubblegum: ఓటీటీలోకి ‘బబుల్‌గమ్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

రోషన్‌ హీరోగా నటించిన ‘బబుల్‌గమ్‌’ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఖరారైంది. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్‌ కానుందంటే?

Published : 01 Feb 2024 19:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాజీవ్‌ కనకాల- సుమ తనయుడు రోషన్‌ (Roshan Kanakala) హీరోగా పరిచయమైన సినిమా ‘బబుల్‌గమ్‌’ (Bubblegum). ఈ రొమాంటిక్‌ డ్రామా గతేడాది డిసెంబరులో థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు ఓటీటీ వేదికగా సందడి చేసేందుకు సిద్ధమైంది. ‘ఆహా’ (aha)లో ఈ నెల 9 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ వివరాలు వెల్లడిస్తూ సదరు సంస్థ పోస్టర్‌ విడుదల చేసింది. రవికాంత్‌ పేరెపు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆదిగా నటించి అలరించాడు రోషన్‌. తన ప్రేయసి జాహ్నవి పాత్రలో మానస చౌదరి ఆకట్టుకుంది. చైతూ జొన్నలగడ్డ, హర్ష, అను హాసన్‌, కిరణ్‌ మచ్చా తదితరులు కీలక పాత్రలు పోషించారు (Bubblegum on Aha).

క‌థేంటంటే: ఆది అలియాస్ ఆదిత్య (రోష‌న్ క‌న‌కాల‌) హైద‌రాబాద్‌కు చెందిన మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుర్రాడు. డీజే అవ్వాల‌న్న ల‌క్ష్యంతో జీవిస్తుంటాడు. ఓ పార్టీలో.. జాను అలియాస్ జాన్వీ (మాన‌స చౌద‌రి)ని చూసి మ‌న‌సు పారేసుకుంటాడు. ఆధునిక జీవ‌న శైలికి అల‌వాటు ప‌డిన ఆమెకు ప్రేమ‌, పెళ్లి వంటి ఎమోష‌న్స్‌పై అంత‌గా న‌మ్మ‌కం ఉండ‌దు. అబ్బాయిల్ని చులకనగా చూసే త‌ను.. మొద‌ట్లో ఆది డీజే ప్లే చేసే తీరును ఇష్ట‌ప‌డుతుంది. ఆ త‌ర్వాత అత‌ని వ్య‌క్తిత్వం న‌చ్చి మ‌రింత స‌న్నిహితంగా మెలుగుతుంది. ఈ క్ర‌మంలో తెలియ‌కుండానే ఆదితో ప్రేమ‌లో ప‌డిపోతుంది. జాను ఫ్రెండ్ చేసిన తొంద‌ర పాటు ప‌ని వాళ్లిద్ద‌రి మ‌ధ్య చిచ్చు రేపుతుంది. వేడుక‌లో అంద‌రి ముందు ఆదిని దారుణంగా అవ‌మానిస్తుంది జాను. మ‌రి, ఆ త‌ర్వాత ఏమైంది? జాను చేసిన ఆ అవ‌మానాన్ని ఆది ఎలా తీసుకున్నాడు? రెండు భిన్న నేపథ్యాలు క‌లిగిన వీరి ప్రేమ ఆఖ‌రికి ఏ కంచికి చేరింది? ఆది తన డ్రీమ్‌ నెరవేర్చుకున్నాడా? అనేది మిగతా కథ.

పూర్తి రివ్యూ కోసం క్లిక్‌ చేయండి..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని