NTR31: ప్రశాంత్‌ నీల్‌- ఎన్టీఆర్‌ల సినిమా టైటిల్‌ ఇదేనా!

ఎన్టీఆర్‌- ప్రశాంత్ నీల్‌ కాంబోలో తెరకెక్కనున్న చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారమవుతోంది.

Published : 17 May 2024 14:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను అధికారికంగా ప్రకటించి చాలా నెలలు అవుతోంది. అప్పటి నుంచి దీనిపై ఎలాంటి అప్‌డేట్‌ లేకపోవడంతో ఫ్యాన్స్ మూవీ టీమ్‌ను ట్యాగ్‌ చేస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ వార్త సోషల్ మీడియాలో షేర్‌ అవుతోంది.  ‘ఎన్టీఆర్‌31’ (NTR31) వర్కింగ్‌ టైటిల్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ‘డ్రాగన్‌’ (Dragon) పేరు ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పేరుతో కొన్ని పోస్టర్లు ఎక్స్‌లో దర్శనమిస్తున్నాయి. అక్టోబర్‌లో ఈ భారీ బడ్జెట్‌ మూవీ పట్టాలెక్కనున్నట్లు సమాచారం. ప్రశాంత్‌ నీల్‌ ఈ చిత్రాన్ని కూడా రెండు భాగాలుగా తెరకెక్కించాలని భావిస్తున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్ వినిపిస్తోంది.

టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్‌ పోస్ట్‌.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?

ఇక ప్రస్తుతం అటు ప్రశాంత్ నీల్ (prashanth neel), ఇటు ఎన్టీఆర్‌ ఇద్దరూ వేర్వేరు సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రశాంత్‌ నీల్ ‘సలార్‌2’ పనుల్లో మునిగిపోయారు. ఎన్టీఆర్‌ ‘దేవర’ షూటింగ్‌లో ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యాక్షన్ డ్రామా ఇది. సముద్ర తీర ప్రాంతం నేపథ్యంలో రెండు భాగాలుగా రూపొందుతోంది. ఈ మూవీతోనే బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడు. తొలి భాగం అక్టోబరు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో పాటు ‘వార్‌2’లోనూ ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. ఈసినిమాతో ఆయన బాలీవుడ్‌లోనూ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని