Chiranjeevi: ఇంతకంటే నాకు కావాల్సిందేముంది.. టాలెంట్ ఒకరి సొత్తు కాదు: చిరంజీవి

హైదరాబాద్: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో తెరకెక్కిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావడం గర్వంగా ఉందన్నారు ప్రముఖ హీరో చిరంజీవి (Chiranjeevi). వరుణ్ తేజ్ (Varun Tej) ప్రధాన పాత్రలో దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ రూపొందించిన చిత్రమిది. మానుషి చిల్లర్ కథానాయిక. మార్చి 1న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పద్మ విభూషణ్‌కు ఎంపికైన సందర్భంగా చిత్ర బృందం ఆయన్ను గజమాలతో సత్కరించింది.
‘‘వరుణ్ సాధారణంగా నాకు మెసేజ్‌లు పెట్టడు.. నేరుగా మాట్లాడతాడు. కానీ, కొన్ని రోజుల క్రితం నేను అమెరికాలో ఉన్నప్పుడు ‘నీతో మాట్లాడాలి’ అంటూ తన నుంచి మెసేజ్ వచ్చింది. ఏమైందో అనుకున్నా. హైదరాబాద్ తిరిగొచ్చాక ఈ సినిమా ఈవెంట్ సంగతి చెప్పాడు. రియల్ హీరోలపై తీసిన చిత్రం గురించి నువ్వు చెబితే రీచ్ వేరేలా ఉంటుందన్నాడు. మనల్ని రక్షించే వారియర్స్ గురించి చెప్పడం నాకు దక్కిన గొప్ప అవకాశంగా భావిస్తున్నా. ఈ వేడుకకు రావడం గర్వంగా ఉంది. తెలుగులో మంచి పారితోషికం ఉంటుందని, కమర్షియల్ డైరెక్టర్‌గా స్థిరపడిపోవచ్చనే ఉద్దేశంతో శక్తి ప్రతాప్ ఇక్కడకు రాలేదు. తన సొంత ఖర్చుతో సర్జికల్ స్ట్రైక్‌పై షార్ట్ ఫిల్మ్ తీశాడు. ఇండియన్ ఎయిర్స్ ఫోర్స్ అది చూసి ఆశ్చర్యపోయింది. ఈసారి సినిమా తీస్తే మరింత సమాచారం మేమిస్తామని సంబంధిత అధికారులు ఆయన్ను ప్రోత్సాహించారు. ఇలాంటి సినిమాలు ఆడాలి. ముఖ్యంగా యువత చూడాలి. ఈ చిత్రాన్ని 75 రోజుల్లో చిత్రీకరించారు. తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి విజువల్స్ ఇవ్వడం ఆషామాషీ విషయం కాదు. ఆ విషయంలో సినిమా విడుదలకు ముందే ఆయన సక్సెస్ అయ్యారు. దీన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి’’
‘‘నవదీప్ మా కుటుంబ సభ్యుడిలాంటివాడు. రామ్ చరణ్ ‘ధ్రువ’ సినిమాలోని తన నటన నాకు ఇష్టం. ఇందులోనూ మంచి పాత్ర పోషించాడు. అభినవ్ ప్రతిభావంతుడు. సోషల్ మీడియాలో కనిపించే మీమ్స్‌లో తనే ఎక్కువగా కనిపిస్తాడు. చరణ్, వరుణ్.. ఇలా వీరంతా నన్ను చూస్తూ వేరే రంగంలోకి వెళ్లలేకపోయారు. చదువు పూర్తయ్యాక యాక్టర్ అవ్వాలనుకున్నారు. ఈ విషయంలో నేను అందరినీ ప్రోత్సహిస్తా. ఎందుకంటే చిత్ర పరిశ్రమను నేను గౌరవిస్తా. మనం ఎంతగా గౌరవిస్తే అంతగా మనల్ని అక్కున చేర్చుకుంటుందని బలంగా నమ్మా. అలాంటి ఇండస్ట్రీలోకి నా బిడ్డలొచ్చారంటే ఇంతకంటే కావాల్సిందేముంది’’
నటుడిగా వరుణ్ నన్ను ఎప్పుడూ ఫాలోకాలేదు. ముందు నుంచీ విభిన్న కథలు ఎంపిక చేసుకుంటూ వస్తున్నాడు. మా కుటుంబ హీరోల్లో ఎవరికీ రాని ఇలాంటి అవకాశాలు వరుణ్‌కు వచ్చాయి. ఎయిర్ ఫోర్స్‌పై టాలీవుడ్‌లో తెరకెక్కిన తొలి చిత్రమిదే. గతేడాది హాలీవుడ్ సినిమా ‘టాప్‌గన్’లోని విజువల్స్ చూసి ఇలాంటిది మనం తీయగలమా? అనుకున్నా. ‘ఆపరేషన్ వాలెంటైన్’ అదే స్థాయిలో ఉంది. టాలెంట్ ఒకరి సొత్తు కాదు’’ అని పేర్కొన్నారు.
‘‘మా పెద్దనాన్న నాకు స్ఫూర్తి. ఆయన మా సినిమా టీమ్‌ని విష్ చేయడానికి వచ్చినందుకు ఆనందంగా ఉంది. కష్టాన్ని నమ్ముకుని పైకి రావాలని ఎప్పుడూ చెబుతుంటారాయన. ఇంతమంది అభిమానుల్ని సంపాదించుకున్న ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నా. సాయుధ బలగాలపై సినిమా చేయడం నాకు గర్వంగా ఉంది’’ అని వరుణ్ తేజ్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

‘రాజా సాబ్’ వాయిదాపై క్లారిటీ....!
‘రాజా సాబ్’ వాయిదా వార్తలపై నిర్మాణసంస్థ పోస్ట్ పెట్టింది. ప్రీరిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన అప్డేట్ను పంచుకుంది. - 
                                    
                                        

నవంబరు ఫస్ట్ వీక్ మూవీస్.. థియేటర్/ఓటీటీ వినోదాలివే..!
ఈ వారం ప్రేక్షకులను అలరించడానికి పలు చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు సిద్ధంగా ఉన్నాయి. మరి ఎప్పుడు ఏ సినిమా వస్తుందో తెలుసా? - 
                                    
                                        

‘పెద్ది’లో జాన్వీ కపూర్ రోల్ ఇదే.. ఆకట్టుకునేలా లుక్స్
‘పెద్ది’ సినిమాలోని జాన్వీ కపూర్ లుక్స్ విడుదలయ్యాయి. - 
                                    
                                        

‘మహాకాళి’గా భూమి శెట్టి.. ఫస్ట్‌లుక్ రిలీజ్
‘మహాకాళి’ సినిమా ఫస్ట్‌లుక్‌ను ప్రశాంత్ వర్మ విడుదల చేశారు. - 
                                    
                                        

సినిమా రేస్ కాదు వేడుక.. ‘ఆర్యన్’ను వాయిదా వేసిన విష్ణు విశాల్
విష్ణు విశాల్ హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘ఆర్యన్’. ఈ సినిమా తెలుగు వెర్షన్ వాయిదా పడింది. - 
                                    
                                        

ఈసారి మామూలుగా ఉండదు.. ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ ఇదే
‘డెకాయిట్’ కొత్త విడుదల తేదీని ప్రకటించారు. అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రమిది. - 
                                    
                                        

ఈ వారం బాక్సాఫీస్ వద్ద వినోదాల విందు.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
అక్టోబరు చివరి వారంలో ప్రేక్షకులను అలరించడానికి పలు ఆసక్తికర చిత్రాలు అటు థియేటర్‌తో పాటు, ఇటు ఓటీటీలో సిద్ధమయ్యాయి. - 
                                    
                                        

మహేశ్-రాజమౌళి మూవీ.. అప్డేట్ పంచుకున్న కాల భైరవ
‘మోగ్లీ’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మహేశ్-రాజమౌళి ప్రాజెక్ట్‌కు సంబంధించి కాల భైరవ అప్డేట్ను ఇచ్చారు - 
                                    
                                        

‘కాంతార చాప్టర్ 1’ మరో రికార్డు.. అలా తొలి ఇండియన్ మూవీ
‘కాంతార చాప్టర్ 1’ మరో రికార్డు నెలకొల్పింది. - 
                                    
                                        

వెంకటేశ్- త్రివిక్రమ్ కాంబో మూవీ.. హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే?
వెంకటేశ్- త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమాలో హీరోయిన్ ఎంపికైంది. ఆమె ఎవరంటే? - 
                                    
                                        

ఇకపై సీక్రెట్‌గా ఉంచాల్సిన అవసరం లేదు..: విశాల్ అధికారిక ప్రకటన
‘మకుటం’ సినిమా విషయంలో వచ్చిన రూమర్స్‌పై విశాల్ స్పందించారు. - 
                                    
                                        

ఈ వారం సినిమాలు: థ్రిల్ చేయనున్న రష్మిక.. ధ్రువ్ యాక్షన్.. ఓటీటీలో ‘ఓజీ’
ఈ వారం వినోదం పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాలు/ వెబ్‌సిరీస్‌లు ఇవే... - 
                                    
                                        

ఈ వారం సినీ దీపావళి.. థియేటర్లలో అవి.. ఓటీటీలో ఇవీ!
ఈవారం థియేటర్లు, ఓటీటీ వేదికగా సందడి చేసేందుకు సిద్ధమైన సినిమాలు/వెబ్‌సిరీస్‌లు ఇవీ.. - 
                                    
                                        

‘రౌడీ జనార్దన్’గా విజయ్ దేవరకొండ.. కొత్త చిత్రం ప్రారంభం
విజయ్ దేవరకొండ కొత్త చిత్రం ప్రారంభమైంది. - 
                                    
                                        

జోష్‌లో ‘పూరి సేతుపతి’.. తాజాగా అప్డేట్ ఇదే
పూరి జగన్నాథ్ - విజయ్ సేతుపతి ప్రాజెక్ట్ పనులు ఫుల్ జోష్‌లో జరుగుతున్నాయి. తాజాగా దీనిపై ఓ అప్డేట్ను పంచుకున్నారు. - 
                                    
                                        

వెంకీ-త్రివిక్రమ్.. ‘ఓజీ’స్ ఎంటర్టైన్మెంట్ షురూ!
త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో వెంకటేశ్ (Venkatesh) కథానాయకుడిగా ఓ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. - 
                                    
                                        

ఈవారం బాక్సాఫీసు ముందుకొచ్చే చిత్రాలివే.. ఓటీటీలో ఏమున్నాయంటే?
ఈవారం బాక్సాఫీసు, ఓటీటీలో సందడి చేసేందుకు పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు రానున్నాయి. అవేంటంటే? - 
                                    
                                        

మొన్న రమణ గోగుల.. ఇప్పుడు ఉదిత్ నారాయణ్..
అనిల్ దర్శకత్వంలో చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’ (Mana Shankara Varaprasad Garu) - 
                                    
                                        

నానితో ‘ఓజీ’ దర్శకుడు.. అతిథిగా వెంకటేశ్
నాని హీరోగా దర్శకుడు సుజీత్ ఓ సినిమాని గురువారం ప్రారంభించారు. వెంకటేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. - 
                                    
                                        

‘మన శంకరవరప్రసాద్ గారు’.. అప్డేట్ వచ్చేసింది
చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ టీమ్ అప్డేట్ పంచుకుంది. ఇందులో నయనతార పాత్రను పరిచయం చేశారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 - 
                        
                            

బాధితులకు రూ.కోటి పరిహారం ఎప్పుడు చెల్లిస్తారు?: తెలంగాణ హైకోర్టు
 



