Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ విజ్ఞప్తి.. డ్యాన్స్‌ చేసిన సీఎం మమతా బెనర్జీ.. ఎక్కడంటే?

పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, హీరో సల్మాన్‌ ఖాన్‌ తదితరులు కలిసి ఓ వేడుకలో డ్యాన్స్‌ చేశారు. ఆ వివరాలతోపాటు వీడియోపై ఓ లుక్కేయండి..

Published : 06 Dec 2023 02:04 IST

కోల్‌కతా: బాలీవుడ్‌ ప్రముఖ హీరో సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) విజ్ఞప్తి మేరకు పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) డ్యాన్స్‌ చేసి అలరించారు. వీరితోపాటు పలువురు సినీ, క్రీడా ప్రముఖులు స్టెప్పులేశారు. కోల్‌కతా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (కేఐఎఫ్‌ఎఫ్‌) (Kolkata International Film Festival)లో వీరంతా సందడి చేశారు. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర సమాచార, సాంస్కృతిక వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో 29వ ‘కేఐఎఫ్‌ఎఫ్‌’ వేడుక మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా సల్మాన్‌ ఖాన్‌, అనిల్‌ కపూర్‌, సోనాక్షి సిన్హా, క్రికెటర్‌ సౌరభ్‌ గంగూలీ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ‘కేఐఎఫ్‌ఎఫ్‌’ థీమ్‌ సాంగ్‌తో ఈవెంట్‌ను ప్రారంభించారు. ఈ క్రమంలో సల్మాన్‌ రిక్వెస్ట్‌ చేయగా మమతా బెనర్జీ వేదికపై కాలు కదిపారు.

ఆ సినిమా ఫ్లాప్‌ అవుతుందని ముందే తెలిసినా.. నటించేవాడిని: నాగ చైతన్య

అనంతరం వేడుకనుద్దేశించి సల్మాన్‌ మాట్లాడుతూ.. ‘‘నేను చూసిన అతి పెద్ద ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో ఇదొకటి. నేను ఓసారి మమతా బెనర్జీ ఇంటికి వెళ్లా. నా ఇంటి కంటే ఆమె ఇల్లు చిన్నది. ఈ స్థాయిలో ఉన్న ఆమె అంత చిన్న ఇంటిని కలిగి ఉండడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది’’ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇతర విశేషాలు మాట్లాడుతుండగా ప్రేక్షకులు.. ‘సల్మాన్‌.. సల్మాన్‌’ అంటూ ప్రాంగణాన్ని హోరెత్తించారు.దీంతో, ‘నాకు మాట్లాడేందుకు అవకాశం లేకుండా ఇంకా గట్టిగా అరవండి’ అంటూ నవ్వులు పూయించారు. సల్మాన్‌ తన అభిమాన నటుడని గంగూలీ తెలిపారు. ఈనెల 12 వరకు ఈ వేడుక జరగనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని