Kalki: ‘కల్కి’లో దీపికా పదుకొణె పాత్ర పేరు ఇదేనా!

‘కల్కి’లో దీపికా పదుకొణె పాత్రకు సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Published : 28 May 2024 16:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ విడుదల తేదీ దగ్గరపడుతోంది. దీంతో ఈ సినిమాకు సంబంధించి ఎన్నో వార్తలు సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారమవుతున్నాయి. తాజాగా దీపికా పదుకొణె (Deepika Padukone) పాత్ర గురించిన రూమర్‌ ఒకటి షేర్‌ అవుతోంది.

ఈ చిత్రంలో ప్రభాస్‌తో (Prabhas) పాటు దీపికా పదుకొణె ప్రధానపాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని కొందరు నటీనటుల పాత్రల పేర్లు ప్రకటించారు. ప్రభాస్‌ భైరవగా, అమితాబ్ బచ్చన్‌ అశ్వత్థామగా కనిపించనున్నట్లు టీమ్ అధికారికంగా వెల్లడించింది. ఇప్పుడు మరో కీలకపాత్రలో నటించనున్న దీపికా పదుకొణె పాత్ర పేరు ట్రెండింగ్‌ అవుతోంది. ఇందులో ఆమె పునర్జన్మ పొందిన లక్ష్మీదేవిలా కనిపించనుందని టాక్ వినిపిస్తుంది. ఆమె పాత్ర పేరు పద్మ అని అంటున్నారు. దీంతో ఈ పాత్రను నాగ్‌అశ్విన్‌ తెరపై ఎలా చూపించారో అని అందరిలో ఆసక్తి ఎక్కువైంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది.

భారీ టైర్లు.. ఆరు టన్నుల బరువు.. ‘కల్కి’లో ‘బుజ్జి’ కారు విశేషాలు తెలుసా?

జూన్‌ 27న ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్‌పై దృష్టిపెట్టింది. అందులోభాగంగానే సినిమాలో ఎంతో కీలకమైన ‘బుజ్జి’ అనే వాహనాన్ని పరిచయం చేసింది. అలాగే  ‘బుజ్జి అండ్‌ భైరవ’ (Bujji And Bhairava) పేరుతో రూపొందించిన ప్రత్యేక వీడియో ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (Amazon Prime Video)లో ఈనెల 31 నుంచి స్ట్రీమింగ్‌ అవుతుందని తెలిపింది. ఈ చిత్రంలో సీనియర్‌ హీరో కమల్‌ హాసన్‌ విలన్‌ పాత్రలో కనిపించనున్నారు. అలాగే దుల్కర్‌ సల్మాన్‌, పశుపతి, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా బడ్జెట్‌ రూ.700 కోట్లని కూడా సోషల్‌ మీడియాలో టాక్‌ వినిపిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని