SSMB29: మహేశ్- రాజమౌళిల ప్రాజెక్ట్‌లో ‘ఆదిపురుష్‌’ నటుడు!

మహేశ్ - రాజమౌళి ప్రాజెక్ట్‌లో బాలీవుడ్‌ నటుడు కీలకపాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది.

Published : 28 May 2024 00:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ హీరో మహేశ్‌బాబు (Mahesh Babu)- అగ్ర దర్శకుడు రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. #SSMB29 వర్కింగ్‌ టైటిల్‌. దీనికి సంబంధించిన ఎన్నో వార్తలు ఇప్పటికే ప్రచారంకాగా తాజాగా మరొకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ భారీ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్‌ నటుడు ఉన్నట్లు తెలుస్తోంది. బీటౌన్‌ నటుడు దేవదత్త నాగే ఈ సినిమాలో భాగమైనట్లు ఆంగ్ల వైబ్‌సైట్స్‌లో కథనాలు వస్తున్నాయి. ‘ఆదిపురుష్‌’లో హనుమంతుడిగా నటించి అందరికీ చేరువయ్యారు దేవదత్త. ఇప్పుడు రాజమౌళి ప్రాజెక్ట్‌తో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. తాజాగా రాజమౌళితో ఆయన దిగిన ఫొటో కూడా వైరల్‌ కావడంతో ఈ రూమర్‌కు బలం చేకూరింది. ఇక ఇటీవల మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కూడా ఈ సినిమాలో కీలకపాత్రలో నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఆయన ఇందులో విలన్‌గా కనిపించనున్నారని టాక్‌ వినిపించింది. ఈ వార్తలన్నీ చూస్తుంటే చిత్రబృందం నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయాలపై మూవీ టీమ్‌ ఇప్పటివరకు స్పందించలేదు.

రణ్‌వీర్‌ లుక్‌టెస్ట్‌ పూర్తయింది: రూమర్స్‌పై స్పందించిన ప్రశాంత్ వర్మ

అడవుల నేపథ్యంలో సాగే ఈ కథ కోసం మహేశ్‌కు సంబంధించిన ఎనిమిది లుక్‌లను రాజమౌళి టీమ్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు దీనికి ‘మహారాజ్‌’ (Maharaj) అనే టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్‌ ఇస్లాన్‌ హీరోయిన్‌గా, హాలీవుడ్‌ ప్రముఖ నటుడు క్రిస్‌ హెమ్స్‌వర్త్‌ కీలకపాత్ర పోషించనున్నారని కూడా జోరుగా ప్రచారమవుతోంది. ఇండియన్ సినిమా ఇప్పటివరకు చూడని సరికొత్త ప్రపంచాన్ని దర్శకధీరుడు ఈ చిత్రంతో సృష్టించనున్నట్లు తెలుస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని