Dhruva Natchathiram: ఆరేళ్ల క్రితం సినిమా.. ఇప్పుడు సెన్సార్‌ పూర్తి..!

విక్రమ్‌ హీరోగా నటించిన ‘ధ్రువ నక్షత్రం’ (Dhruva Natchathiram) సెన్సార్‌ పనులు పూర్తి చేసుకుంది. నవంబర్‌ 24న ఈ చిత్రం విడుదల కానుంది.

Published : 29 Sep 2023 18:59 IST

చెన్నై: విక్రమ్‌ (Vikram) హీరోగా గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ (Gautham Vasudev Menon) తెరకెక్కించిన చిత్రం ‘ధ్రువ నక్షత్రం’ (Dhruva Natchathiram). తాజాగా ఈ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. దాదాపు 2 గంటల 25 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్‌ను సెన్సార్‌ బోర్డు జారీ చేసింది. మొత్తం 11 మార్పులను సూచించింది. సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో ఉపయోగించిన పలు అభ్యంతరకర పదాలను మ్యూట్‌ చేయాలని తెలిపింది. అలాగే, రెండో పాట ఆఖరిలో చూపించిన లిప్‌లాక్‌ సీన్‌ నిడివి తగ్గించాలని పేర్కొంది.

స్పై, యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో గౌతమ్‌ మేనన్‌ దీనిని సిద్ధం చేశారు. 2016లోనే ఈ సినిమా పట్టాలెక్కింది. 2017లో విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. చిత్రీకరణ పూర్తైనప్పటికీ అనుకోని కారణాలతో ఇది వాయిదా పడింది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఇప్పుడు ఈ సినిమా విడుదలకు రంగం సిద్ధమైంది. నవంబర్‌ 24న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. రీతూవర్మ, సిమ్రన్‌, ఐశ్వర్య రాజేశ్‌, రాధిక, తదితరులు కీలకపాత్రలు పోషించారు.

Prithviraj Sukumaran: రోజుకు 9 గంటలు ఫిజియోథెరపీ.. హెల్త్‌ అప్‌డేట్‌పై హీరో పోస్ట్‌

‘రూల్స్‌ రంజన్‌’ కూడా..!

కిరణ్‌ అబ్బవరం, నేహాశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘రూల్స్‌ రంజన్‌’. రత్నం కృష్ణ దర్శకుడు. అక్టోబర్‌ 6న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్‌ అందుకున్నట్లు సమాచారం. ఫ్యామిలీ, రొమాంటిక్‌ చిత్రంగా ఇది తెరకెక్కింది. సెప్టెంబర్‌ 28నే విడుదల చేయాలని చిత్రబృందం మొదట భావించింది. అనుకోని కారణాలతో అక్టోబర్‌ 6కు వాయిదా పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని