Animal: ‘యానిమల్‌’, ‘స్పిరిట్‌’ యూనివర్స్‌పై స్పందించిన సందీప్‌ రెడ్డి.. ఏమన్నారంటే?

తన తాజా చిత్రాలు యానిమల్‌, స్పిరిట్‌ యూనివర్స్‌లో భాగంగా ఉంటాయా? అనే ప్రశ్న ఎదురవగా దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా స్పందించారు.

Published : 23 Nov 2023 20:25 IST

దిల్లీ: భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ‘యూనివర్స్‌’ ట్రెండ్‌ నడుస్తోంది. కథలు వేరైనా ఒక సినిమాలోని హీరో పాత్ర అదే దర్శకుడు తెరకెక్కించే మరో సినిమాలో కనిపించే ఈ విధానం ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచుతోంది. ఇప్పటికే ‘లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌’ (ఖైదీ, విక్రమ్‌), ‘యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ స్పై యూనివర్స్’ (పఠాన్‌, టైగర్‌ 3 తదితర చిత్రాలు) సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘సందీప్‌రెడ్డి వంగా వైలెంట్‌ యూనివర్స్‌’పై చర్చ మొదలైంది. ఆ యూనివర్స్‌ గురించి బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ (ranbir kapoor) ప్రశ్నించగా సందీప్‌ స్పందించడం అందుకు కారణమైంది.

పైలట్‌ లెటర్‌.. ఆనందంగా ఉందంటూ ఆనంద్‌ ట్వీట్‌

ఈ ఇద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘యానిమల్‌’ (Animal). రష్మిక (Rashmika) కథానాయిక. బాబీ దేవోల్‌ కీలక పాత్ర పోషించారు. డిసెంబరు 1న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న నేపథ్యంలో చిత్ర బృందం దిల్లీలో ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ నిర్వహించింది. ట్రైలర్‌ విడుదల అనంతరం టీమ్‌ మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా రణ్‌బీర్‌ మాట్లాడుతూ.. ‘సర్‌.. నేను నటించిన యానిమల్‌, ప్రభాస్‌తో మీరు తీయబోతున్న ‘స్పిరిట్‌’ని వైలెంట్‌ యూనివర్స్‌లో భాగం చేస్తారా?’ అని అడగ్గా.. అలాంటి ఆలోచన ఉంటే ముందే సమాచారం ఇస్తా నవ్వుతూ సమాధానమిచ్చారు సందీప్‌. దీంతో, యూనివర్స్‌పై హింట్‌ ఇచ్చేశారంటూ సినీ అభిమానులు ఫిక్స్‌ అయిపోయారు. సోషల్‌ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

రణ్‌బీర్‌ ఇంకా మాట్లాడుతూ.. ‘‘దాదాపు రెండేళ్లు ఈ సినిమా కోసం పనిచేశాం. మూడున్నరేళ్ల క్రితం సందీప్‌ ఈ స్క్రిప్టు నాకు వినిపించాడు. అతడు కథ చెప్పడం పూర్తికాగానే నేను నా ముఖాన్ని అద్దంలో చూసుకుని.. నేను ఇది చేయగలనా? అని సందేహించా. ఎందుకంటే అప్పటి వరకు నేను అలాంటి స్టోరీని వినలేదు. సందీప్‌కు నేను అభిమానిని. ఆయన తెరకెక్కించిన ‘అర్జున్‌ రెడ్డి’, ‘కబీర్‌సింగ్‌’ నాకు బాగా ఇష్టం. ఆయన దర్శకత్వంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నా’’ అని పేర్కొన్నారు. ‘‘యానిమల్‌’ సినిమా ప్రయాణం మంచి అనుభూతి కలిగించింది. నటన పరంగా రణ్‌బీర్‌ సపోర్ట్‌గా నిలిచారు. ఇది వైలెంట్‌ ఫిల్మ్ అని నేను అనుకోవడం లేదు’’ అని రష్మిక తెలిపారు. బాబీ దేవోల్‌ మాట్లాడుతూ.. రణ్‌బీర్‌పై ప్రశంసలు కురిపించారు. రణ్‌బీర్‌ కంటే గొప్ప డ్యాన్సర్‌ లేరన్నారు. ఆయన ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారని పేర్కొన్నారు. రణ్‌బీర్‌తో కలిసి నటించే అవకాశం ‘యానిమల్‌’తో దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు